చంద్రబాబు కి అసలు సిసలైన రిటర్న్ గిఫ్ట్ మొదలైంది !

Written By Siddhu Manchikanti | Updated: June 04, 2019 12:35 IST
చంద్రబాబు కి అసలు సిసలైన రిటర్న్ గిఫ్ట్ మొదలైంది !

చంద్రబాబు కి అసలు సిసలైన రిటర్న్ గిఫ్ట్ మొదలైంది !

 
రిటర్న్ గిఫ్ట్ అనే పదం రెండు తెలుగు రాష్ట్రాలలో పెను సంచలనాలు సృష్టించింది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండో అసెంబ్లీ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ గెలిచినప్పుడు..ఆ సమయంలో రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ అధినేత చంద్రబాబు కలుగజేసుకుని విధానాన్ని బట్టి గెలిచిన తర్వాత కెసిఆర్ మాట్లాడుతూ చంద్రబాబు కి త్వరలో రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నట్లు పేర్కొన్న పదం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో ఊతపదం అయిపోయింది. ఇదిలావుండగా తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరూ ఊహించలేని విధంగా అధికారంలోకి వచ్చిన జగన్ తన ప్రత్యర్థి చంద్రబాబు కి దిమ్మ తిరిగిపోయే విధంగా అసలు సిసలు రిటర్న్ గిఫ్ట్ సిద్ధం చేసినట్లు ఏపీ రాజకీయాలలో వినబడుతున్న టాక్.
 
అయితే జగన్ చంద్రబాబు కి ఇవ్వబోయే రిటర్న్ గిఫ్ట్ ఓ రేంజ్ లో ఉండబోతున్నట్లు దీని ప్రభావం చంద్రబాబు రాజకీయ జీవితానికి డ్యామేజ్ అయ్యే చాన్స్ ఉన్నట్లు సమాచారం. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు విజయవాడ అమరావతి సమీపంలో లింగమనేని ఎస్టేట్స్ వారి నుంచి ఒక వసతి గృహాన్ని నిర్మించుకున్న సంగతి తెలిసిందే.అయితే ఆ ఇంటి కోసం చంద్రబాబు చేసిన పనికి జగన్ ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్టు సమాచారం.ఆ ఇంటికి సంబంధించి చంద్రబాబు అక్కడ ఉండే వారు అన్న సంగతి అందరికీ తెలిసిందే.కానీ ఆ ఇల్లు కట్టడానికి మాత్రం చంద్రబాబు తన స్వంత డబ్బులు ఖర్చు పెట్టకుండా మొత్తం అంతా ప్రభుత్వ ఖాజానా నుంచి ఖర్చు పెట్టారట.
బాబు అవసరాల కోసం ప్రభుత్వ ఖాజానాను ఖాళీ చెయ్యడం పట్ల జగన్ చంద్రబాబు పై ఒక కీలక నిర్ణయం తీసుకోనున్నారని అసలు ప్రభుత్వ సొమ్మును తన విలాసాల కోసం వినియోగించడం ఏమిటని కొంత మంది ప్రశ్నలు వేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఖర్చును తన సొంత లాభాల కోసం వాడిన చంద్రబాబుని స్థానానికి లాక్కొని వెళ్లి రాజకీయంగా దెబ్బ కొట్టడానికి జగన్ అద్భుతమైన ప్లాన్ వేసినట్లు సమాచారం.
Top