వణికిపోతున్న పశ్చిమగోదావరి టిడిపి ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే..?

Written By Siddhu Manchikanti | Updated: June 30, 2019 10:47 IST
వణికిపోతున్న పశ్చిమగోదావరి టిడిపి ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే..?

వణికిపోతున్న పశ్చిమగోదావరి టిడిపి ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే..?
 
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ చింతమనేని ప్రభాకర్ వణికిపోతున్నట్లు ఏపీ రాజకీయాల్లో వినబడుతున్న టాక్. విషయంలోకి వెళితే నిత్యం వార్తల్లో నిలిచే చింతమనేని ప్రభాకర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి ఎక్కడా కూడా లేకుండా పరిపాలిస్తున్న జగన్ వ్యవహారశైలి గురించి ఆందోళన చెందుతున్నట్లు... తనపై ఉన్న కేసులను బయటకు తీస్తారేమోనని చింతమనేని ప్రభాకర్ భయంతో బిక్కుబిక్కుమంటూ ఉన్నట్లు సమాచారం. గతంలో అధికారంలో ఉన్న సమయంలో ఎవరిని పడితే వారి పై చేసుకునే విధంగా చింతమనేని వ్యవహార శైలి ప్రస్తుతం దానికి భిన్నంగా ఉండటంతో చుట్టుపక్కల ఉన్న నేతలు ఆశ్చర్యపోతున్నారట. అయితే ఇటీవల జరిగిన దెందులూరు నియోజకవర్గంలో అక్రమంగా చింతమనేని ప్రభాకర్ పొలాల నుండి తీసుకువెళ్లిన పైపుల వివాదాన్నీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై చంద్రబాబు కూడా చింతమనేనికి హెచ్చరికలు జారీ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అప్పటి నుంచే చింతమనేని ప్రభాకర్ వణికిపోతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది.
Top