చంద్రబాబు త్వరలో జైల్లో ఉంటాడు

Written By Siddhu Manchikanti | Updated: July 05, 2019 13:37 IST
చంద్రబాబు త్వరలో జైల్లో ఉంటాడు

చంద్రబాబు త్వరలో జైల్లో ఉంటాడు " ఈ మాట అన్నది ఎవరో కాదు !
 
ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు గురించి ఏపీ బిజెపి నేతలు షాకింగ్ కామెంట్ చేశారు. ఇటీవల ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఎన్నడూ లేని విధంగా చాలా తక్కువ స్థానాలు అనగా 23 శాసనసభ స్థానాలు మరియు 3 ఎంపీ స్థానాలు గెలుచుకొని జగన్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయింది. కొద్దిపాటి శాతంతో ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. ఇటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నా నేతలు పార్టీలో ఉంటే ఇంకా భవిష్యత్తు ఉండదని ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే టీడీపీకి చెందిన చాలామంది చంద్రబాబు సన్నిహితులు బిజెపి పార్టీ లో చేరగా తాజాగా మరికొంతమంది ఎమ్మెల్యేలు అనగా 18 మంది ఎమ్మెల్యేలు బిజెపి పార్టీ లోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి పార్టీ నేత సునీల్ దియోడార్ తెలిపారు. గతంలో 2014 నుండి 2019 వరకు చంద్రబాబు ఉన్న హయాంలో రాష్ట్రంలో అనేక అవినీతి జరిగిందని ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో జరిగిన అవినీతి వల్ల చంద్రబాబు జైలుకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు.
Top