బాబు ని బుక్ చేసిన నిమ్మల?

Written By Siddhu Manchikanti | Updated: July 12, 2019 11:03 IST
బాబు ని బుక్ చేసిన నిమ్మల?

బాబు ని బుక్ చేసిన నిమ్మల?
 
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలలో రైతులకు సున్నా వడ్డీ రుణాలు అన్న విషయంపై చర్చ జరుగుతున్న క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా అడ్డంగా బుక్ చేసినట్లు అయ్యింది. జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ళనుండి ఉన్న పావలా వడ్డీ రుణాలను తమ ప్రభుత్వం వచ్చాక రైతులకు సున్నా వడ్డీ రుణాలు గా మార్చిందని గొప్పగా సీఎం జగన్ చెప్పటంతో...వెంటనే తెలుగుదేశం పార్టీకి చెందిన నిమ్మల రామానాయుడు లేచి ఒక ఫేక్ కామెంట్ ఆధారంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్న సమయంలో చెయ్యని పని చేసినట్లుగా చెప్పడంతో అసెంబ్లీలో ఈ విషయంపై పెద్ద చర్చ జరిగింది.
 
అసెంబ్లీలో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ..బాబు హయాంలో రైతులకు పావలా వడ్డీకే రుణాలు అందించారు. అది కూడా బాబు హయాంలో మొదలైన పథకమేమీ కాదు. అయితే వడ్డీ లేని రుణాలను జగన్ సర్కారేమీ కొత్తగా ఇవ్వలేదని తమ పార్టీ అధినేత చంద్రబాబు కూడా అమలు చేశారని రామానాయుడు చెప్పారు. దీంతో రామానాయుడు మాటల్లో వాస్తవం లేకపోవడంతో వెంటనే పసిగట్టిన జగన్...చంద్రబాబుకి సవాలు విసిరారు. అంతేకాకుండా అసెంబ్లీలో ఉన్న తెలుగుదేశం పార్టీ సభ్యుల కు ఈ విషయంపై చుక్కలు చూపించారు జగన్. బాబు హయాంలో ఒక్కరంటే ఒక్క రైతు కైనా వడ్డీ లేకుండా రుణాలిచ్చినట్టు నిరూపించాలని లేని పక్షంలో చంద్రబాబు రాజీనామా చేస్తారా? అని జగన్ ఏకంగా ఓ పెను సవాల్ నే విసిరారు. ఈ సవాల్ తో బాబు నిజంగానే ఉక్కిరిబిక్కిరి అయ్యారని చెప్పాలి. చంద్రబాబు హయాంలో అసలు వడ్డీ లేని రుణాలన్న మాటే లేదు కదా. అలాంటిది జగన్ సర్కారు కంటే తామే మెరుగ్గా పనిచేశామన్న కోణంలో తనదైన వాదన వినిపించేందుకు సిద్ధపడిన రామానాయుడు... బాబును నిజంగానే బుక్ చేసినట్లయింది సభలో. మొత్తం మీద రైతులకు 0 వడ్డీలకు రుణాలు అన్న అంశంపై చంద్రబాబు పై మరియు టిడిపి పై అదిరిపోయే రీతిలో గతంలో ఏం చేశారు అన్న దానిపై ఫుల్ క్లారిటీ తో దుమ్ము దులిపేశారు సీఎం జగన్.
Top