Advertisement

ఎందుకు చంద్రబాబు అలా సైలెంట్ గా చూస్తున్నారు ? ఏమీ చెయ్యలేరా ?

by Siddhu Manchikanti | July 15, 2019 16:18 IST
ఎందుకు చంద్రబాబు అలా సైలెంట్ గా చూస్తున్నారు ? ఏమీ చెయ్యలేరా ?

ఎందుకు చంద్రబాబు అలా సైలెంట్ గా చూస్తున్నారు ? ఏమీ చెయ్యలేరా ?
 
తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు కేరాఫ్ అడ్రస్ అని ఎప్పుడూ తెగ డప్పు కొడుతుంటారు ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు. తీరా ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే పార్టీలో ఉన్న నాయకుల మధ్య సరైన అవగాహన లేకుండా బహిరంగంగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో ఈ పరిస్థితి చూస్తుంటే చాలా మంది రాజకీయ నేతలు చంద్రబాబు ఈ విషయంలో ఎందుకు అలా సైలెంట్ గా చూస్తున్నారు? ఏమి చెయ్యలేరా ? అని మండిపడుతున్నారు. అసలు విషయంలోకి వెళితే ఇటీవల తెలుగుదేశం పార్టీలో కేశినేని నాని, బుద్ధావెంకన్న మధ్య కొన్ని రోజులుగా మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం నాడు అది మరింత తీవ్రరూపం దాల్చింది.
 
సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్టు తిట్టుకుంటున్న ఈ నేతలిద్దరూ చంద్రబాబు మాటను ఖాతరు చేయడం లేదు. ఇగోలకు పోయి పార్టీ పరువు తీస్తున్నారు."నాలుగు ఓట్లు సంపాదించలేనివాడు, నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు. నాలుగు పదాలు చదవలేనివాడు, నాలుగు వాక్యాలు రాయలేనివాడు, ట్వీట్ చేస్తున్నాడు. దౌర్భాగ్యం!" అంటూ కేశినేని నాని విమర్శల పర్వాన్ని ప్రారంభిస్తే.. బుద్ధావెంకన్న మరింత రెచ్చిపోయారు. "నువ్వు చేసినవన్నీ అభాంఢాలు, నేను చెప్పేవన్నీ నిజాలు. బస్సుల మీద ఫైనాన్స్ తీసుకొని 1997లో సొంతంగా దొంగ రిసిప్ట్ లు తయారుచేసుకుని ఫైనాన్స్ వారికి డబ్బులు చెల్లించకుండా నువ్వే దొంగ ముద్ర వేసుకొని కోట్లాది రూపాయలకు ఫైనాన్స్ కంపెనీలకు మోసం చేసిన నువ్వా ట్వీట్ చేసేది" అంటూ రెచ్చిపోయారు బుద్ధా వెంకన్న. దీంతో పరిస్థితి శృతిమించుతున్న నేపథ్యంలో చంద్రబాబు చొరవ తీసుకుని కంట్రోల్ చేయాలని పార్టీలో ఉన్న నాయకులు ఈ పరిణామంపై కామెంట్లు చేస్తున్నారు.


Advertisement


Advertisement


Top