ఆ ఫేమస్ ఆలయం కింద భారీ నిధి ? సెన్సేషనల్ గా మారిన న్యూస్ !

ఆ ఫేమస్ ఆలయం కింద భారీ నిధి ? సెన్సేషనల్ గా మారిన న్యూస్ !

ఆ ఫేమస్ ఆలయం కింద భారీ నిధి ? సెన్సేషనల్ గా మారిన న్యూస్ !
 
దేశంలో ఫేమస్ ఆలయాలలో ఒక ఆలయం మధుర మీనాక్షి వారి ఆలయం. తాజాగా ఈ ఆలయానికి సంబంధించిన ఒక భారతదేశంలోనే సెన్సేషనల్ న్యూస్ గా మారిపోయింది. తమిళనాడులో ఉన్న ఈ ఆలయం దగ్గరగా పార్కింగ్ పనులు జరుగుతుండగా ఈ ఆలయం కింది భాగంలో ఒక నేలమాళిగ బయటపడటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పార్కింగ్ కోసం గత కొన్ని నెలలుగా జరుగుతున్న పనులలో ఇటీవల ఒక భారీ లోతైన కొంత తీస్తుండగా ముందుగా పది అడుగుల పొడవైన రాతిస్తంభం తవ్వకాల్లో బయటపడింది...ఇదే క్రమంలో మరింత లోతుగా తవ్వకాలు జరుపుతుండగా నేలమాళిగ బయటపడింది. దీంతో.. ఈ నేలమాళిగలో ఏముందన్న ఆసక్తి వ్యక్తమవుతోంది.
 
గుడికి సమీపంలో ఉన్న నేపథ్యంలో భారీ నిధికి అవకాశం ఉండి ఉంటుందా? అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరోపక్క నిధికి సంబంధించి వస్తున్న వార్తలపై స్థానికులు నిధికి అవకాశం ఉండకపోవచ్చన్న కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ న్యూస్ దేశవ్యాప్తంగా సెన్సేషనల్ గా మారింది.Top