బ్రేకింగ్ న్యూస్: బాలయోగి ఆస్తి కాజేసింది నేనే అంటున్న కేశినేని నాని..!

Written By Siddhu Manchikanti | Updated: July 16, 2019 15:57 IST
బ్రేకింగ్ న్యూస్: బాలయోగి ఆస్తి కాజేసింది నేనే అంటున్న కేశినేని నాని..!

బ్రేకింగ్ న్యూస్: బాలయోగి ఆస్తి కాజేసింది నేనే అంటున్న కేశినేని నాని..!
 
ఆంధ్ర ప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ చిత్తు చిత్తుగా ఓడిన నాటి నుండి విజయవాడ ఎంపీ చేసిన నాని తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారారు. చంద్రబాబు వల్లే మరియు ఆయన భజన చేసే వారివల్లే తెలుగుదేశం పార్టీ ఈ స్థితికి చేరిందని పరోక్షంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ...ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో హాట్ టాపిక్ అయ్యారు కేశినేని నాని. అంతే కాకుండా ఇటీవల టిడిపి పార్టీలో అత్యంత కీలక నాయకుడు అయిన బుద్ధా వెంకన్న పై ఫైర్ అయ్యి వార్తల్లో నిలిచిన కేసినేని నాని తాజాగా ఎమ్.పి కేశినేని నాని చేసిన తాజా ట్వీట్ ఆసక్తికరంగా ఉంది.
 
అవును తాను బాలయోగి ఆస్తులను కాజేశానంటూ చేసిన వ్యాఖ్య ద్వారా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కు సమాదానం చెప్పారు. ‘నేను బాలయోగి ఆస్తులు కాజేశానని ఒక్క ప్రబుద్ధుడు చెప్పింది యదార్థం. బాలయోగి కి ఉన్న ఆస్తులు నీతి, నిజాయితీ విలువలు, సిద్ధాంతాలు ప్రజల్ల పట్ల అంకితభావం, ప్రాంతాన్ని అభివృద్ధి చేసే చిత్తశుద్ధి వీటిని కాజేసి పాటిస్తున్నందుకు చాలా గర్వ పడుతున్నాను.’ అని కేశినేని నాని వ్యాఖ్యానించారు.
Top