అసెంబ్లీలో జగన్ భజన చేస్తున్న జనసేన ఎమ్మెల్యే..!

అసెంబ్లీలో జగన్ భజన చేస్తున్న జనసేన ఎమ్మెల్యే..!

అసెంబ్లీలో జగన్ భజన చేస్తున్న జనసేన ఎమ్మెల్యే..!
 
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్... ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు జగన్ పై ఎలా విరుచుకుపడదామా ఏ విధంగా ప్రజలలో జగన్ ని చులకన చేద్దామా అన్నట్టుగా... భారీ బహిరంగ వేదికలో... మీడియా సమావేశాలలో వ్యవహరిస్తుంటారు. అయితే తీరా అసెంబ్లీలో జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వ్యవహారం చూస్తే మరొక విధంగా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాపాక జగన్ భజన చేస్తుండటంతో జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలకు మరి పవన్ కళ్యాణ్ అభిమానులకు నచ్చటం లేదు. ఇక అసలు విషయంలోకి వెళితే ముఖ్యమంత్రి జగన్ గారు అభివృద్దిని ,సంక్షేమాన్ని సమతుల్యం చేస్తూ బడ్జెట్ ప్రవేశ పెట్టారని రాపాక వరప్రసాద్ జగన్ ని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశారు.
 
బడ్జెట్ తీరును ఆయన ప్రశంసిస్తూ మాట్లాడారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి బాటలోనే ఆయన కుమారుడు జగన్ కూడా వ్యవసాయం గురించి శ్రద్ద చూపుతున్నారని ఆయన అన్నారు. వ్యవసాయం దండగ అనే పరిస్థితి నుంచి వ్యవసాయం పండగ అన్న విదంగా తీసుకు వచ్చింది రాజశేఖరరెడ్డి అని ఆయన అన్నారు. ఇప్పుడు జగన్ కూడా రైతులకు పెట్టుబడి సాయం చేస్తూ వారిని ఆదుకోవడానికి ముందుకు వచ్చిన ఘనత జగన్ ది అని ఆయన అన్నారు. పంటల నష్ట పోయి ఎవరైనా రైతు ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబానికి ఏడు లక్షల పరిహారం ఇవ్వాలన్న నిర్ణయం హర్షణీయమని ఆయన అన్నారు. కౌలు రైతులకు ఒప్పందపత్రాన్ని ప్రవేశపెట్టడాన్ని కూడా ఆయన సమర్ధించారు. కొబ్బరి రైతులు ధరలు రాక బాగా నష్టపోతున్నారని, కొబ్బరి కి కూడా కొనుగోలు చేస్తామని జగన్ చెప్పారని వెంటనే ఆ కార్యక్రమం చేపట్టాలని కోరుతున్నానని జగన్ గురించి మాట్లాడితే మొత్తం మీద ముఖ్యమంత్రి జగన్ గారు తన తండ్రి మాదిరిగానే రైతుల గురించి అద్భుతంగా ఆలోచిస్తున్నారని రైతు ప్రభుత్వం అన్నట్టుగా జగన్ బడ్జెట్ ప్రవేశ పెట్టినట్లు రాపాక వ్యాఖ్యానించారు.Top