గరుడ శివాజీ కి ఇక ఆ ఒక్క పార్టీనే గతి ఏమో…!

Advertisement

by Siddhu Manchikanti | July 30, 2019 14:33 IST
Follow Xappie
గరుడ శివాజీ కి ఇక ఆ ఒక్క పార్టీనే గతి ఏమో…!

గరుడ శివాజీ కి ఇక ఆ ఒక్క పార్టీనే గతి ఏమో…!
 
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆపరేషన్ గరుడ పేరిట రచ్చ రచ్చ చేసిన నటుడు శివాజీ తరువాత టీవీ9 రవి ప్రకాష్ ఫోర్జరీ కేసు లో ఇరుక్కుని వార్తల్లో హైలెట్ అవ్వడం జరిగింది. ఈ విషయంలో టీవీ9 కొత్త యాజమాన్యం కేసు పెట్టడంతో హైదరాబాద్ విమానాశ్రయంలో పోలీసులకు చిక్కి నటుడు శివాజీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఓ ప్రముఖ న్యూస్ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆపరేషన్ గరుడ శివాజీ షాకింగ్ కామెంట్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న అధికార పార్టీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తప్పుడు కేసులు బనాయించి తనని మానసికంగా దెబ్బ తీస్తున్నారని చెప్పుకొచ్చారు. త్వరలో తాను అధికారికంగా రాజకీయాలలో చేరబోతున్నాను అని ప్రకటించిన శివాజీ ఒక జాతీయ పార్టీలో చేరుతానని చెప్పుకొచ్చారు. జమిలి ఎన్నికలు వస్తే ప్రాంతీయ పార్టీలు అనేవి ఉండవని కూడా చెప్పాడు.
 
తనని దెబ్బ తీసి సినిమా చూపించాలని అనుకుంటున్న వారికి త్రీడీలో సినిమా చూపిస్తా అని సంచలన కామెంట్స్ చేసారు. ఇటువంటి నేపథ్యంలో ఓ ప్రముఖ జాతీయ పార్టీలో శివాజీ చేరబోతున్నట్లు ఇంటర్వ్యూ తెలిపారు. అయితే దేశంలో జాతీయ పార్టీలు అంటే రెండే రెండు ఒకటి బిజెపి రెండవది కాంగ్రెస్. అయితే ముందు నుండి శివాజీ బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడే క్రమంలో ఇక గత్యంతరం లేక ఇంకొక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీలో శివాజీ చేరడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు శివాజీ చేసిన కామెంట్లపై వ్యాఖ్యానిస్తున్నారు.


Advertisement


Advertisement

Top