ప్రతిపక్షాన్ని అడ్డం పెట్టుకొని ఇలా చేయడం ఏంటి జగన్ గారు..?

Written By Siddhu Manchikanti | Updated: August 02, 2019 18:42 IST
ప్రతిపక్షాన్ని అడ్డం పెట్టుకొని ఇలా చేయడం ఏంటి జగన్ గారు..?

ప్రతిపక్షాన్ని అడ్డం పెట్టుకొని ఇలా చేయడం ఏంటి జగన్ గారు..?
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన జగన్ 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబును చిత్తు చిత్తుగా ఓడించి ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన సంగతి అందరికీ తెలిసినదే. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కుర్చీలో కూర్చుని రెండు నెలలు కావస్తున్నా క్రమంలో జగన్...ప్రతిపక్షాన్ని అడ్డంపెట్టుకుని వాళ్ళు చేసిన అవినీతి పైన ఎక్కువ ఫోకస్ పెట్టడం ఏంటి అంటూ జనాలు కొంత జగన్ పై మండిపడుతున్నారు. ప్రకటించిన సంక్షేమ పథకాలు అద్భుతమని అవి ఆచరణలో పెడితే చాలా బాగుంటుందని పేర్కొన్నారు. ముఖ్యంగా చంద్రబాబు ప్రవేశపెట్టిన విధానాలను తిట్టి కొత్త విధానం తీసుకు వస్తాను అంటూ ప్రతిపక్షాన్ని అడ్డం పెట్టుకొని జగన్ వ్యవహరిస్తున్న వారి పై మండి పడుతున్నారు. అన్నా క్యాంటీన్ ల విషయం లో అలాగే ఇసుక టెండర్ విషయం లో పోలవరం పనుల్లో ప్రతిపక్షం టీడీపీ వ్యవహరించిన విధానాన్ని రద్దు చేసి కొత్త విధానం తీసుకు రాబోతున్నట్లు జగన్ చెబుతున్నారు మంచిదే కానీ... జగన్ పనులు చేసుకుంటూ పోతే బాగుంటుందని గత ప్రభుత్వం అవినీతి చేసినందువల్లే ప్రతిపక్షంలో కూర్చోబెట్టడం ఆ విషయాలనే పట్టించుకోని జగన్ అభివృద్ధి పై దృష్టి పెడితే మంచిదని అంటున్నారు ఏపీ ప్రజలు.
Top