సోషల్ మీడియాలో టివి 9 రవిప్రకాష్ పై ఎవరు ఊహించని సెటైర్లు వేసిన విజయసాయిరెడ్డి…!

Advertisement

by Siddhu Manchikanti | May 10, 2019 10:03 IST
Follow Xappie
సోషల్ మీడియాలో టివి 9 రవిప్రకాష్ పై ఎవరు ఊహించని సెటైర్లు వేసిన విజయసాయిరెడ్డి…!

సోషల్ మీడియాలో టివి 9 రవిప్రకాష్ పై ఎవరు ఊహించని సెటైర్లు వేసిన విజయసాయిరెడ్డి…!
 
వైసీపీ పార్టీ సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి టివి 9 రవిప్రకాష్ పై ఎవరు ఊహించని విధంగా కామెంట్లు చేశారు. టివి 9 రవిప్రకాష్ ఇలాంటి వారు జర్నలిజంలో ఉండబట్టే తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా బ్రష్టుపట్టిపోయిందని తెలుగు మీడియా దిగజారిపోయింది అన్న వార్తలు ఇలాంటి వారి వల్లే వచ్చాయని తీవ్రస్థాయిలో టివి 9 రవిప్రకాష్ పై కామెంట్లు చేశారు. వీళ్ల బారినుంచి మీడియా బయట పడితే మళ్లీ 1980ల ముందు నాటి విశ్వసనీయత వస్తుందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమించిన మీడియా ఆ తర్వాత బ్లాక్‌మెయిలర్లు, కుల పిచ్చగాండ్ల చేతికి వెళ్లిందని ట్విటర్‌లో వ్యాఖ్యానించారు. శ్రీనిరాజు సంస్థలో పనిచేస్తూ ఆయన తోడల్లుడు సత్యం రామలింగరాజును బ్లాక్ మెయిల్ చేసిన ఘనుడు రవిప్రకాష్‌ అని ఆయన ఆరోపించారు.
 
మెరుగైన సమాజం కోసం ‘చెమటలు’ కక్కిన రవిప్రకాష్‌ తక్షణం పోలీసులకు లొంగిపోయి సహకరించారలని పౌర సమాజం కోరుతోంది. మెరుగైన సమాజం కోసం పరివర్తన తీసుకుచ్చే ప్రవక్తలాగా చెలరేగిన రవి ప్రకాష్‌ చేయని దుర్మార్గాలు లేవు. మతాలను కించపర్చడం, కార్పోరేట్ల విబేధాల నుంచి భార్య భర్తల గొడవల వరకు టీవీ స్క్రీన్ పైకి ఎక్కించి సమాజాన్ని భ్రష్టు పట్టించాడు. కులం లేదంటూనే మీడియాలో కుల గజ్జి ని వ్యాప్తి చేశాడు. మెరుగైన సమాజాన్ని అడ్డుకున్న ద్రోహి రవిప్రకాష్‌ బండారం ఎట్టకేలకు బయట పడింది. ఈయన బాధితులు ఒక్కొక్కరు ఇప్పుడు బయటకొస్తున్నారు. ‘కమ్మ’ని నీతులకు కాలం చెల్లింది. చంద్రబాబు ప్రయోగించిన తుప్పు పట్టిన మిస్సైళ్లలో రవిప్రకాష్‌ ఒకడు. అని విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.


Advertisement


Advertisement

Top