Advertisement

పునర్నవి క్రేజ్ ఏంట్రా బాబు అలా ఉంది!

by Siddhu Manchikanti | July 24, 2019 14:56 IST
పునర్నవి క్రేజ్ ఏంట్రా బాబు అలా ఉంది!

పునర్నవి క్రేజ్ ఏంట్రా బాబు అలా ఉంది!
 
బిగ్‌బాస్‌ సీజన్ 3 లో ఉయ్యాల జంపాల ఫేమ్‌ పునర్నవి భూపాలం కనుబొమ్మలకు అందచందాలకు తెలుగు కుర్రకారు సోషల్ మీడియాలో మనసు పారేసుకున్నారు. హౌస్ లో ఆమె వేసే సంప్రదాయ దుస్తులకు తెగ కామెంట్లు పెడుతున్నారు. గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉయ్యాల జంపాల సినిమాలో జండూభామ్‌(సునీత)గా ప్రేక్షకులను అలరించి.. మళ్లీ మళ్లీ ఇది రానిరోజు సినిమాలో శర్వానంద్‌ కూతురు పార్వతి పాత్రలో ఆకట్టుకుంది పునర్నవి భూపాలం. చిన్న చిన్న పాత్రలను చేస్తూ.. క్రేజ్‌ను సంపాదించుకుంటోన్న పునర్నవి బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
 
అయితే ప్రస్తుతం జరుగుతున్న ఎపిసోడ్ లలో పునర్నవి ఆడుతున్న ఆటకు ప్రవర్తనకు తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు ఎంతగానో మంత్రముగ్ధులవుతున్నారు. దీంతో చాలా మంది పునర్నవి భూపాలం కోసం సోషల్ మీడియాలో ఆమె పేరిట ఆర్మీ క్రియేట్ చేయడానికి కొంతమంది రెడీ అవుతున్నట్లు బయటనుండి ఆమెకు సపోర్ట్ చేయడానికి కృషి చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినబడుతున్నాయి. దీంతో పునర్నవి క్రేజ్ ఏంట్రా బాబు అంటే మిగతా కంటెస్టెంట్ ల అభిమానులు సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు.


Advertisement


Advertisement


Top