బిగ్ బాస్ మీద అతిపెద్ద కేసు పడబోతోంది? అందుకే ఆర్గనైజర్లు ఇలా చేశారు?

Written By Siddhu Manchikanti | Updated: July 25, 2019 15:21 IST
బిగ్ బాస్ మీద అతిపెద్ద కేసు పడబోతోంది? అందుకే ఆర్గనైజర్లు ఇలా చేశారు?

బిగ్ బాస్ మీద అతిపెద్ద కేసు పడబోతోంది? అందుకే ఆర్గనైజర్లు ఇలా చేశారు?
 
ఎన్నో వివాదాల నడుమ బిగ్ బాస్ సీజన్ 3 స్టార్ట్ అయింది. షో ప్రారంభం కాకముందు నుండే ఎన్నో విమర్శలు వివాదాలు బిగ్ బాస్ షో చుట్టూ అలుముకున్నాయి. ఏదిఏమైనా ఎలాగైనా షో ప్రారంభం అయ్యింది. ఇటువంటి నేపథ్యంలో తాజాగా షో పై మరో అతిపెద్ద కేసు పడుతున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి. అంతేకాకుండా షో మీద ఇప్పటికే పలు కేసులు నమోదవడం మనకందరికీ తెలిసినదే. షో ప్రారంభం కాకముందు బిగ్ బాస్ లోకి తీసుకుంటున్నట్లు గాయత్రీ గుప్త ని, శ్వేత రెడ్డి ని తీసుకుంటున్నట్లు ఆశ చూపి పక్కన పెట్టారని..దీంతో తమ కెరీర్లు డైలమాలో పడ్డాయని... సినిమా ఇండస్ట్రీ నుండి అనేక అవకాశాలు వచ్చినా బిగ్ బాస్ హౌస్ కోసం వాటిని వదులుకున్నట్టు గాయత్రి గుప్తా గతంలో బిగ్ బాస్ హౌస్ షో నిర్వాహకులపై కేసు పెట్టడం జరిగింది.
 
అయితే ఇప్పుడు తాజాగా టాటా రెడ్డి రంగంలోకి దిగింది. బిగ్ బాస్ హౌస్ లో అవకాశం ఇస్తాం అంటూ షో నిర్వాహకులు లైంగిక వేధింపులకు గురి చేసినట్లు పేర్కొంటూ శ్వేతా రెడ్డి శ్యామ్ - రఘు - శశికాంత్ లపై కంప్లైంట్ ఇవ్వడం ఇప్పుడు సంచలనం రేపింది. దీంతో పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. అయితే వారు షో నిర్వాహకులు పరారీలో ఉండటంతో హౌస్ మీద పెద్ద కేసు పడే అవకాశం ఉండటంతో... బిగ్ బాస్ ఆర్గనైజర్లు సో నిర్వాహకులకు ముందే బెయిల్ పిటిషన్ నాంపల్లి కోర్టులో అప్లై చేసి పొందటంతో... ఈ షో పై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పుడు తాజాగా పోలీసుల నుండి మా ఛానల్ నిర్వాహకులకు నోటీసులు అందినట్లు సమాచారం.




Top