బిగ్ బాస్ 3 విషయం లో ఈ కౌశల్ హడావిడి ఏంటి ?

Advertisement

by Siddhu Manchikanti | July 25, 2019 15:11 IST
Follow Xappie
బిగ్ బాస్ 3 విషయం లో ఈ కౌశల్ హడావిడి ఏంటి ?

బిగ్ బాస్ 3 విషయం లో ఈ కౌశల్ హడావిడి ఏంటి ?
 
బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ తాజాగా ఇటీవల మూడవ సీజన్ పై షాకింగ్ కామెంట్లు చేశారు. సోషల్ మీడియాలో కౌశల్ బిగ్ బాస్ త్రీ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ చాలా గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన కౌశల్..“హౌస్‌లో తన పేరును ఎక్కడా వాడటానికి వీల్లేదని, పబ్లిసిటీ కోసం కానీ ఇంటర్వ్యూల్లో కూడా ‘కౌశల్‌ ఆర్మీ’ అనే పేరు వాడొద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా ఇటీవల హాట్ యాంకర్ శ్రీముఖి పేరిట సోషల్ మీడియాలో ఆర్మీ ఏర్పడటంతో కౌశల్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతుంది.
 
సీజన్ త్రి స్టార్ట్ అవ్వగానే ‘శ్రీముఖి ఆర్మీ’ పేరిట సోషల్ మీడియాలో ఖాతాలను తెరిచి హడావుడి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే శ్రీముఖి, జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి వీరాభిమాని… పవన్ కళ్యాణ్ అభిమానులందరూ మరియు, జనసేన కార్యకర్తలు అందరూ శ్రీముఖికి సపోర్ట్ చేయాలని, ఈ షో ల కూడా పవన్ వీరాభిమానినే గెలిపించాలని ఫిక్స్ అయ్యారని ఇప్పటికే సమాచారం కూడా అందింది. మరోపక్క కౌశల్ తన పేరు ఎక్కడ ఇటువంటి విషయాలలో తీసుకొస్తారని బిగ్ బాస్ ఇంటి సభ్యులకు...ఇంస్టాగ్రామ్ లో వార్నింగ్ ఇచ్చే టట్లు వీడియో రావడంతో...వీడియో పై నెటిజన్లు ఏంటి కౌషల్ హడావిడి అంటూ కామెంట్ చేస్తున్నారు.


Advertisement


Advertisement

Top