Bigg Boss Telugu S03: బిగ్ బాస్ కొత్త స్ట్రాటజీ ఇదే ? ఇంతకంటే చేతకాదా వీళ్ళకి?

Advertisement

by Siddhu Manchikanti | July 26, 2019 16:28 IST
Follow Xappie
Bigg Boss Telugu S03: బిగ్ బాస్ కొత్త స్ట్రాటజీ ఇదే ? ఇంతకంటే చేతకాదా వీళ్ళకి?

బిగ్ బాస్ కొత్త స్ట్రాటజీ ఇదే ? ఇంతకంటే చేతకాదా వీళ్ళకి ?
 
ఇది బిగ్ బాస్ హౌస్ కాదు డబ్ల్యూ డబ్ల్యూ వార్ హౌస్ లాగ వుంది. మొదటి రోజు నుండే హౌస్ లో నామినేషన్ పద్ధతి స్టార్ట్ చేసి ఇంటి సభ్యుల మధ్య విభేదాలు సృష్టించి...వాటి పర్యవసానాలు వచ్చే గొడవలను టెలివిజన్ ప్రేక్షకుల హృదయాల్లో బిగ్ బాస్ షో పై ఇంట్రెస్టింగ్ కలిగించే విధంగా షో నిర్వాహకులు అనుసరిస్తున్న వైఖరిపై సోషల్ మీడియా లో నెటిజన్లు బిగ్ బాస్ 3 పై మండి పడుతున్నారు.
 
తాజాగా గురువారం జరిగిన లాస్ట్ ఎపిసోడ్ లో ఏకంగా హౌస్ లో 3 గొడవలు జరగడంతో..షో చూసిన చాలామంది ఇది ప్రిపేర్ స్క్రిప్ట్ అని...అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఎంత దారుణంగా చీప్ ట్రిక్స్ ప్లే చేసి టీఆర్పీ రేటింగ్స్ కోసం ప్రేక్షకుల మనోభావాలతో షో నిర్వాహకులు ఆడుకోవటం మంచిది కాదని చాలా మంది బిగ్ బాస్ త్రీ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ నటి హేమ అతిగా ప్రవర్తించడం అలాగే ఇంటి సభ్యులు ప్రతి సందర్భంలో కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి బదులు ఎప్పుడు గొడవకి దిగుదామా అన్నట్టుగా ప్రవర్తించడంతో..బిగ్ బాస్ 3 షో పై సెటైర్లు పేలుతున్నాయి సోషల్ మీడియాలో. ఇంతకంటే చేతకాదా వీళ్ళకి ఈ మాత్రం దానికోసం ఇంత హడావిడి మొన్నటి నుండి చేశారు అంటూ షో పై మండి పడుతున్నారు.


Advertisement


Advertisement

Top