Bigg Boss Telugu S03: మహేశ్ అసలు ఏమన్నాడు? వరుణ్ ఎందుకు అరుస్తున్నాడు .. బిగ్ బాస్ రచ్చ మామూలుగా లేదు!

Advertisement

by Siddhu Manchikanti | July 26, 2019 16:31 IST
Follow Xappie
Bigg Boss Telugu S03: మహేశ్ అసలు ఏమన్నాడు? వరుణ్ ఎందుకు అరుస్తున్నాడు .. బిగ్ బాస్ రచ్చ మామూలుగా లేదు!

మహేశ్ అసలు ఏమన్నాడు? వరుణ్ ఎందుకు అరుస్తున్నాడు .. బిగ్ బాస్ రచ్చ మామూలుగా లేదు!
 
గతంలో జరిగిన రెండు సీట్ల కంటే ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 3 మొత్తం వివాదాలతో నిండిపోయింది. ఇంటిలోకి సభ్యులు కేవలం గొడవ పెట్టుకోవడానికి వచ్చినట్లు ప్రస్తుతం హౌస్ లో జరుగుతున్న పరిస్థితులు బట్టి తెలుస్తోంది. షో స్టార్ట్ అయిన నాటి నుండి మొత్తం షో అంత వివాదాలతో నిండిపోవడంతో సీజన్ 3 పై అనేక విమర్శలు వస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో గురువారం జరిగిన ఎపిసోడ్ లో మహేష్ వరుణ్ మధ్య జరిగిన గొడవ షో కే హైలెట్ గా రచ్చ రచ్చ గా నిలిచింది. విషయంలోకి వెళితే...మైక్ బ్యాటరీ చేంజ్ చేసుకోవటానికి స్టోర్ రూమ్ లోకి రాహుల్ వెళ్ళాడు. పక్కనే మహేష్ డోర్ లో నిలబడి ఉన్నాడు.
 
ఆ సమయంలో వితిక లోపాలకి వెళ్లబోతుంది. మహేష్ తన చేతిని డోర్ కి అడ్డంగా పెట్టాడు, వితిక దానిని కిందకి దించే ప్రయత్నం చేసింది. దీనితో మహేష్ “పో” అన్నాడు. అంటే చెయ్యి అలాగే ఉంటుంది దూరి వెళ్ళు అని అర్ధం. దీనితో వితిక, మహేష్ మీద సీరియస్ అయ్యింది. పో అనేది ఏంటి, మార్నింగ్ నుండి చూస్తున్న సరిగ్గా మాట్లాడటం రాదా అంటూ మహేష్ తో వాదనకి దిగింది. దీంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం జరుగుతున్న సందర్భంలో వితిక భర్త..వరుణ్ సందేశ్ సీన్ లోకి ఎంట్రీ అవటంతో...గొడవ రసవత్తరంగా మారింది. ఆ సిచువేషన్ గా వరుణ్ సందేశ్ ఎంట్రీ ఇచ్చి...లేడీస్ తో ఎలా బిహేవ్ చేయాలో తెలియదా అంటూ ముందు నా వైఫ్ కి మర్యాద ఇవ్వు అంటూ మహేష్ పై కొట్టేదాకా వెళ్ళాడు. దీంతో గొడవ ముదురుతున్న నేపథ్యంలో మిగతా ఇంటి సభ్యులు వచ్చి మహేష్ ని అలాగే వరుణ్ సందేశ్ ని పక్కకు లాగి గొడవ పెద్దది అవకుండా చేసి వారిని అక్కడి నుండి పంపించేశారు. దీంతో గొడవ సద్దుమణిగింది.


Advertisement


Advertisement

Top