Bigg Boss Telugu S03: న్యూస్ చానెళ్లకు దిమ్మతిరిగిపొయే షాక్ ఇచ్చిన బిగ్ బాస్ !

Advertisement

by Siddhu Manchikanti | July 29, 2019 14:59 IST
Follow Xappie
Bigg Boss Telugu S03: న్యూస్ చానెళ్లకు దిమ్మతిరిగిపొయే షాక్ ఇచ్చిన బిగ్ బాస్ !

న్యూస్ చానెళ్లకు దిమ్మతిరిగిపొయే షాక్ ఇచ్చిన బిగ్ బాస్ !
 
వరుసగా వివాదాలతో హౌస్ లో రచ్చ రచ్చ చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 రియాల్టీ షో ప్రస్తుతం టెలివిజన్ రంగంలో అత్యంత ప్రజాదరణ పొందుతోంది. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లో తాజాగా ఎలిమినేట్ ఎపిసోడ్లు వస్తున్న నేపథ్యంలో గతంలో హౌస్ లో నుండి ఎలిమినేట్ అయిన సభ్యులను కొంతమంది మీడియా చానల్స్ టిఆర్పి రేటింగ్ కోసం వారిని పిలిపించి డిబేట్ పెట్టుకొని చాలావరకు లాభపడటం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో తాజాగా న్యూస్ ఛానల్ కు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చే విధంగా బిగ్ బాస్ షో నిర్వాహకులు ఇంటిలో ఎంట్రీ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఎలిమినేట్ అవుతారు వాళ్లు ముందుగా మొదట స్టార్ మాకే ఇంటర్వ్యూ ఇచ్చేలా ఒప్పందం చేసుకుంది.
 
ఆ వివాదాలు - రేటింగ్ లు న్యూస్ చానెల్స్ కు దక్కకుండా స్టార్ మాకే దక్కేలా వారితో ఇంటర్వ్యూలకు ప్లాన్ చేసింది. ఎలిమినేట్ కాగానే స్టార్ మాతో వారు ఈ షోకు సంబంధించిన అన్ని విషయాలు పంచుకోవాలన్న షరతు పెట్టిందన్న మాట. ఇందుకోసం పోయినసారి బిగ్ బాస్ సీజన్2లో ఫైనల్స్ కు చేరి తృటిలో టైటిల్ చేజార్చుకున్న హీరో తనీష్ ను హోస్ట్ గా పెట్టుకుంది స్టార్ మా. తాజాగా తనీష్ తో దీనికి సంబంధించిన ప్రోమోలు కూడా విడుదలయ్యాయి. బిగ్ బాస్ ఎలిమినేటర్స్ తో తనీష్ డిబేట్లు పెట్టి క్యాష్ చేసుకొనే సరికొత్త కార్యక్రమాన్ని రూపొందించారు. మొత్తంమీద తాజాగా బిగ్ బాస్ షో నిర్వాహకులు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు టెలివిజన్ రంగంలో సంచలనం సృష్టిస్తోంది.


Advertisement


Advertisement

Top