Bigg Boss Telugu S03 : హిమజ ఏడుపు మామూలుగా తగలలేదు.., మొత్తానికి అమ్మాజీ బయటకి

Advertisement

by Siddhu Manchikanti | July 29, 2019 15:05 IST
Follow Xappie
Bigg Boss Telugu S03 : హిమజ ఏడుపు మామూలుగా తగలలేదు.., మొత్తానికి అమ్మాజీ బయటకి

బిగ్ బాస్ : హిమజ ఏడుపు మామూలుగా తగలలేదు.., మొత్తానికి అమ్మాజీ బయటకి
 
బిగ్ బాస్ సీజన్ 3 లో మొట్ట మొదటి సారిగా ఎలిమినేట్ అయిన ఇంటి సభ్యురాలు టాలీవుడ్ ఇండస్ట్రీ సీనియర్ నటి హేమ. హౌస్ లో కిచెన్ కి హెడ్ గా ఉంటూ బిగ్ బాస్ చెప్పినదాన్ని చేస్తూ కొంత హడావిడి ఎక్కువ చేసిన క్రమంలో ఏంటి సభ్యులతోపాటు ఓటింగ్ లో కూడా తెలుగు ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకోలేకపోయింది హేమ. దీంతో మూడవ సీజన్ లో మొట్టమొదటి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ గా హేమ వార్తల్లో నిలిచింది. అయితే హేమ హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వడానికి గల కారణాలలో ఒక కారణం హిమజ ఏడుపు అని ఆమె ఏడుపు మామూలుగా తగల్లేదు అంటూ మొత్తానికి అమ్మాజీ బయటికి వెళ్లి పోయిందని అక్క తోపు అంటూ ఇంటి సభ్యులే హేమా ని తెలివిగా బయటకు సాగనంపారు అని తాజాగా జరిగిన ఎలిమినేట్ ఎపిసోడ్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
 
ఈ క్రమంలో ఎపిసోడ్ చూసిన చాలా మంది.. హిమజా ఏడుపు హేమ కి గట్టిగా తేలిందని అంటున్నారు. హౌస్‌లో కన్నీళ్లు పెట్టిన మొట్ట మొదటి కంటెస్టెంట్‌ అని, ఎందుకు కన్నీళ్లు పెట్టావంటూ హిమజను నాగార్జున ప్రశ్నించడం జరిగింది. తాను మొదట్నుంచీ సెన్సిటివ్‌ అని, తన మూలానా మహేష్‌కు గాయమైందనే బాధలో ఉండగా.. హేమ ఏదో అనడంతో బాగా ఏడుపు వచ్చిందని తెలిపింది. తాను రెడ్‌ మార్క్‌ను తొలగించుకునేందుకు మాత్రమే ఉదయాన్నే బాత్రూమ్‌ను క్లీన్‌ చేయలేదని, అంతకుముందు కూడా చేశానని తెలిపింది. మొత్తం మీద సీనియర్ నటి హేమ వెళ్లిపోవడంతో హౌస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అవడంతో సీజన్ త్రీ షో రసవత్తరంగా మారింది.


Advertisement


Advertisement

Top