Bigg Boss Telugu S03: షాకింగ్ : వైల్డ్ కార్డ్ ఎంట్రీగా తమన్నా..!

Advertisement

by Siddhu Manchikanti | July 29, 2019 15:10 IST
Follow Xappie
Bigg Boss Telugu S03: షాకింగ్ : వైల్డ్  కార్డ్ ఎంట్రీగా తమన్నా..!

షాకింగ్ : బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా తమన్నా..!
 
బిగ్ బాస్ హౌస్ నుండి మొట్టమొదటి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ హేమ. ఇంటి సభ్యుల ఆదరణ కాక షో చూస్తున్న వీక్షకుల అభిమానం కూడా ఓటింగ్లో హేమ దక్కించుకోకపోవడంతో ఇంటి నుంచి హేమ ఎలిమినేట్ అవుతున్నట్లు బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కింగ్ నాగార్జున ప్రకటించడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఇంటి నుండి ఒకరు ఎలిమినేట్ కాగా మరొకరు ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం హౌస్ లో మొత్తం ఆడా మగా అనే తేడా లేకుండా గొడవలు వివాదాలు జరుగుతున్న క్రమంలో ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి వైల్డ్ కార్డు గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఈమె ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ పై పోటీ చేయడం జరిగింది.
 
ఒకటిఅరా కామెడీ షోల్లో నవ్వించడానికి ప్రయత్నించిన ఈ తమన్నా సింహాద్రికి సోషల్‌మీడియాలో మంచి ఫాలోయింగ్‌ ఉంది. యూత్‌లో సూపర్‌ క్రేజ్‌ ఉంది. ఎవరు ఏ కాంట్రవర్సీలు స్టార్ట్‌ చేసినా అందులో వేలు పెట్టే తమన్నా.. గతంలో శ్రీరెడ్డి ఆడియోను లీక్‌ చేయడంలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. మొత్తం మీద కాంట్రవర్సీలు లకు కేరాఫ్ అడ్రస్ గా గత కొంత కాలం నుండి సోషల్ మీడియాలో పెద్ద సెలబ్రిటీ గా మారిపోయిన తమన్నా సింహాద్రి వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వటంతో ఇప్పుడు ఈ షోపై ప్రేక్షకుల్లో రసవత్తరమైన ఆసక్తి నెలకొంది.


Advertisement


Advertisement

Top