Bigg Boss Telugu S03 : బిగ్ బాస్ 3 గురించి భలే విషయం చెప్పాడుగా.. నాగ్ ఓపెన్ అయిపోయాడు!

Advertisement

by Siddhu Manchikanti | July 26, 2019 16:46 IST
Follow Xappie
Bigg Boss Telugu S03 : బిగ్ బాస్ 3 గురించి భలే విషయం చెప్పాడుగా.. నాగ్ ఓపెన్ అయిపోయాడు!

బిగ్ బాస్ 3 గురించి భలే విషయం చెప్పాడుగా .. నాగ్ ఓపెన్ అయిపోయాడు!
 
ప్రస్తుతం సోషల్ మీడియాలో టెలివిజన్ రంగంలో బిగ్ బాస్ 3 పెద్ద హాట్ టాపిక్ అయింది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున యాంకరింగ్ అదిరిపోయింది అంటూ చాలామంది షో స్టార్ట్ అయిన తర్వాత రోజు సోషల్ మీడియాలో నాగార్జునపై పొగడ్తల వర్షం కురిపించారు. ముఖ్యంగా షో కి తన వాక్చాతుర్యంతో అలాగే సీనియార్టీ తో అద్భుతంగా బిగ్ బాస్ షో స్టేజీపై రాణించడంతో ఇప్పుడు హౌస్ సభ్యులకంటే నాగార్జున గురించే ఎక్కువ డిస్కషన్ చేస్తున్నారు.
 
ఇంతలో తన పై కాంప్లిమెంట్స్ రావడంతో నాగార్జున బిగ్ బాస్ 3 గురించి కొత్త విషయం బయట పెట్టాడు. ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ సెట్ వైపు వెళ్లిన ప్రతిసారీ.. పాపం.. లోపలేం చేస్తున్నారో అని తాను అనుకుంటానని చెప్పారు నాగ్. బిగ్ బాస్ షోలో ఎవరు పాల్గొంటున్నారన్న విషయం మీకు ముందే తెలుసు కదా? అంటే.. బాబోయ్.. నాకు తెలీనే తెలీదన్నారు. అదే విషయాన్ని ఇంట్లో చెప్పినా వాళ్లెవరూ నమ్మలేదన్నారు. తాను షోకు వచ్చే ఐదు నిమిషాల ముందు మాత్రమే బిగ్ బాస్ లో పాల్గొనే కంటెస్టెంట్ల లిస్ట్ ఇచ్చారని.. అప్పుడే వాళ్ల గురించి తాను తెలుసుకున్నట్లు చెప్పారు.


Advertisement


Advertisement

Top