సౌత్ ఇండస్ట్రీలో ఆ రికార్డు సొంతం చేసుకున్న మొట్టమొదటి హీరో మహేష్..!

By Xappie Desk, January 14, 2019 14:05 IST

సౌత్ ఇండస్ట్రీలో ఆ రికార్డు సొంతం చేసుకున్న మొట్టమొదటి హీరో మహేష్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో బాక్సాఫీస్ దగ్గర తన స్టామినాను చాటుతూ అనేక రికార్డులు సృష్టించిన సూపర్ స్టార్ మహేష్ సౌత్ ఇండియాలో అనేక బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ప్రస్తుతం మహేష్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ అనే తన కెరియర్లో 25వ సినిమా ను చేస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ విదేశాలలో ముగించుకుని..తాజా షెడ్యూల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకుంటుంది. వేసవి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు సినిమా యూనిట్. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు పెట్టుకున్నారు సూపర్ స్టార్ మహేష్ అభిమానులు. ఇదిలా ఉండగా సౌత్ ఇండస్ట్రీలో సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుకు అరుదైన రికార్డ్‌ వరించింది. మహేష్‌ను తమ బ్రాండ్లకు ప్రచారకర్తగా నియమించుకునేందుకు ఎన్నో దిగ్గజ సంస్థలు ఆసిక్తి చూపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం మహేష అభిబస్, గోల్డ్ విన్నర్, థమ్స్ అప్, చెన్నై సిల్క్స్, క్లోజ్ అప్‌లతో కూడిన 15 బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. దీంతో సౌత్ ఇండియాలోనే అత్యధిక బ్రాండ్స్‌కు ఎండార్స్ చేస్తున్న మొట్టమొదటి హీరోగా మహేష్ రికార్డ్ క్రియేట్ చేశాడు. దీంతో ఈ వార్త తెలుసుకున్న సూపర్ స్టార్ మహేష్ అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు.


Forum Topics


Top