హిట్టు కోసం మళ్లీ అదే కాంబినేషన్ రిపీట్ చేస్తున్న అల్లు అర్జున్ ..!

By Xappie Desk, January 14, 2019 15:09 IST

హిట్టు కోసం మళ్లీ అదే కాంబినేషన్ రిపీట్ చేస్తున్న అల్లు అర్జున్ ..!

హిట్టు కోసం మళ్లీ అదే కాంబినేషన్ రిపీట్ చేస్తున్న అల్లు అర్జున్ ..!
 
నాపేరు సూర్య దారుణంగా ఫ్లాప్ అవడంతో అల్లు అర్జున్ చాలా తీవ్ర నిరాశ చెందాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన నా పేరు సూర్య అభిమానులను అలరించడం లో విఫలం అవడంతో మరియు వరుస విజయాలను మీద ఉన్న బన్నీకి దారుణమైన ఫ్లాప్ ఇచ్చిన క్రమంలో తన తర్వాత సినిమా ఎలాగైనా భారీ బ్లాక్ బస్టర్ అవ్వాలని ఇప్పటికే చాలా కథలు విన్నాడు. అయినా కానీ ఏ స్టోరీ కూడా కన్ఫర్మ్ చేయలేదు. చాలా మంది డైరెక్టర్లు స్టోరీలు వినిపించిన తాను శాటిస్ఫాక్షన్ అవ్వకపోవడంతో వాటినన్నింటినీ పక్కన పెట్టేసాడు. ఈ క్రమంలో తాజాగా ఇటీవల గతంలో తనకు రెండు హిట్లు ఇచ్చిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఆయన చెప్పిన స్టోరీ నచ్చడంతో ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ లో వినపడుతున్న టాక్. గీతాఆర్ట్స్‌, హారిక అండ్ హాసిని సంయుక్తంగా నిర్మించ‌నున్న ఈ చిత్రంలో తొలిసారి బ‌న్నీ ద్విపాత్రాభిన‌యం చేయ‌బోతున్నాడు. `భ‌ర‌త్ అనే నేను`, `విన‌య విధేయ రామ‌` ఫేమ్ కియారా అద్వానీ క‌థానాయిక‌గా న‌టి్ంచే అవ‌కాశం వుంద‌ని తెలిసింది. కాగా ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి రెండ‌వ వారంలో సెట్స్‌పైకి తీసుకురావాల‌ని త్రివిక్ర‌మ్ ఇప్ప‌టికే క‌స‌ర‌త్లు మొద‌లుఎట్టిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.


Tags :


Top