బోయపాటితో సినిమా అనేటప్పటికి భయపడుతున్న మహేష్ అభిమానులు..?

By Xappie Desk, January 14, 2019 15:12 IST

బోయపాటితో సినిమా అనేటప్పటికి భయపడుతున్న మహేష్ అభిమానులు..?

బోయపాటితో సినిమా అనేటప్పటికి భయపడుతున్న మహేష్ అభిమానులు..?
 
ప్రస్తుతం మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన కెరియర్ లో 25వ సినిమాను చేస్తున్నాడు. ‘మహర్షి’ అనే టైటిల్ పేరిట తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది. ముఖ్యంగా స్పైడర్ వంటి ఫ్లాప్ సినిమా తర్వాత ‘భరత్ అనే నేను’ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన మహేష్ అదే ఊపును కొనసాగించాలని కోరుకుంటున్నారు మహేష్ అభిమానులు. అయితే తాజాగా మహేష్ మరొక సినిమా గురించి కొత్త వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ప్రముఖ మాస్టర్ ఆక్టర్ బోయపాటి దర్శకత్వంలో మహేష్ సినిమా చేయబోతున్నట్లు కనబడుతున్న వార్త. తాజాగా బోయపాటి దర్శకత్వం వహించిన వినయ విధేయ రామ చిత్రం విడుదలయ్యే ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు. దీంతో ఆ సినిమా రిజల్ట్ చూసిన మహేష్ అభిమానులు ఈ సమయంలో కెరీర్ మంచి ఊపు మీద ఉన్న టైంలో ప్రయోగాలు చేయొద్దు అని మహేష్ కి సలహాలు ఇస్తున్నారట. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్న మహేష్...సినిమా పూర్తయిన వెంటనే సుకుమార్ డైరెక్షన్లో సినిమా చేయనున్నాడు. మరి బోయపాటి దర్శకత్వంలో మహేష్ సినిమా ఉంటుందో లేదో చూడాలి.


Tags :


Top