బ్రహ్మానందం ఇంటికి వెళ్లిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ..!

By Xappie Desk, February 08, 2019 09:55 IST

బ్రహ్మానందం ఇంటికి వెళ్లిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ..!

కమెడియన్ బ్రహ్మానందం వీటివల్ల అస్వస్థతకు గురవడంతో ముంబై నగరంలో ప్రముఖ హాస్పిటల్ లో హార్ట్ సర్జరీ చేయించుకున్నారు. గత కొంత కాలం నుండి వెండితెరకు దూరంగా ఉంటూ సినిమాలు చేయకుండా బుల్లితెరపై ప్రత్యక్షమవుతున్న బ్రహ్మానందం తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఇండస్ట్రీ మొత్తం షాక్ తింది. అయితే సర్జరీ చేయించుకున్న బ్రహ్మానందాన్ని వైద్యులు విశ్రాంతి తీసుకోమని సలహా ఇవ్వడంతో ప్రస్తుతం బ్రహ్మానందం ఇంటిదగ్గర హైదరాబాదులో విశ్రాంతి తీసుకుంటున్నాడు.
 
దీంతో బ్రహ్మీ ఇంటికి వచ్చాడని తెలుసుకున్న ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఆయనను పరామర్శించడానికి బ్రహ్మానందం ఇంటికి క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బ్రహ్మానందం ఇంటికి వెళ్లి ఆయ‌న ఆరోగ్యంపై ఆరా తీశారు. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాక్షించాడు బ‌న్ని. బ్ర‌హ్మీ తిరిగి సినిమాల‌లో న‌టిస్తార‌ని బ‌న్ని ఆశాభావం వ్య‌క్తం చేశాడు. మునుపటిలా ఆయన సినిమాలు చేయాలని, మరింత కాలం మనల్ని నవ్వించాలని కోరుకున్నారు. క‌లెక్ష‌న్ కింగ్ మోహన్ బాబు కూడా బ్రహ్మానందం ఇంటికి వెళ్లి ఆయ‌న‌ను పరామర్శించారు. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాన‌ని ఆయ‌న తెలిపారు.Top