అభిమానికి సెటైర్ వేసిన మహేష్ బాబు..!

By Xappie Desk, March 26, 2019 11:34 IST

అభిమానికి సెటైర్ వేసిన మహేష్ బాబు..!

అభిమానికి సెటైర్ వేసిన మహేష్ బాబు..!
 
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఒకపక్క సినిమా రంగంలోనూ మరోపక్క వ్యాపార రంగంలో ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న మహేష్ బాబు ఇటీవల హైదరాబాద్ నగరంలో ఓ భారీ షాపింగ్ మాల్ కట్టిన సంగతి మనకందరికీ తెలిసినదే. ఇంతటి క్రేజ్ ఉన్న మహేష్ బాబు పై సింగపూర్ దేశానికి చెందిన ఓ ప్రముఖ సంస్థ మైనపు బొమ్మను మేడమ్ టుస్సాడ్స్ అనే సంస్థ ఏఎంబీ సినిమాస్ లో లాంచ్ చేసింది.
 
ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పాల్గొన్న మహేష్ బాబు ని కొంటె ప్రశ్నలు అడిగారు విలేకరులు. లాంచ్ చేసిన మహేష్ బాబు మైనపు బొమ్మను ఏ సినిమాలో అయినా చూసే అవకాశం ఉందా అని ఓ విలేఖరి అడుగగా చూడాలంటే సింగపూర్ వెళ్లాల్సిందే అని, సినిమాల్లో చూసే అవకాశం ఉండదని కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో ఈ వేడుకకు హాజరైన మహేష్ బాబు భార్య నమ్రత...తనకు రెండో భర్త మహేష్ దొరికాడని కామెంట్ చేయడంతో అక్కడున్న అభిమానులు మరియు చాలామంది నవ్వేశారు. మరోపక్క మహేష్ అభిమానులు ఆ మైనపు బొమ్మ దగ్గర సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు.


Tags :


Top