బుర్ర కథ చెబుతా అంటున్న హీరో ఆది!

Written By Xappie Desk | Updated: April 13, 2019 14:03 IST
బుర్ర కథ చెబుతా అంటున్న హీరో ఆది!

బుర్ర కథ చెబుతా అంటున్న హీరో ఆది!
 
ప్రస్తుతం సాయికుమార్ తనయుడు ఆది హీరోగా తన మొదటి రెండు సినిమాలతో మంచి హిట్లు అందుకున్న ఆ తరువాత ఏ సినిమా కూడా ఆశించిన స్థాయి మెప్పించ లేక పోయింది . ఈ మధ్య "నెక్స్ట్ నువ్వే" మూవీ తో కాస్త పర్వలేదనిపించాడు.
 
అయితే ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఒక సినిమాను పట్టాలెక్కించాడు. ఒక్క మెదడుతోనే ఎన్నో విషయాలు ఆలోచించగలుగుతున్నాం. అదే రెండు మెదళ్లు ఉంటే? ఇదే కాన్సెప్ట్‌తో ‘బుర్ర కథ’ చిత్రం తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా రచయిత డైమండ్‌ రత్నబాబు దర్శకుడిగా మారారు.
 
మిస్తీ చక్రవర్తి, నైరా షా హీరోయిన్లు. దీపాల ఆర్ట్స్‌ బ్యానర్‌పై హెచ్‌. శ్రీకాంత్‌ దీపాల నిర్మించారు. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ ను గురువారం రిలీజ్‌ చేశారు. ‘‘రెండు షేడ్స్‌లో ఆది సాయికుమార్‌ పాత్ర ఉండబోతోంది. షూటింగ్‌ పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
 
సమ్మర్‌లో సినిమాను రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. రాజేంద్రప్రసాద్, పోసాని కృష్ణమురళి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, కెమెరా: సి.రాంప్రసాద్‌.
Top