రజినీ కాంత్ వయసు తగ్గింది!

రజినీ కాంత్ వయసు తగ్గింది!

రజినీ కాంత్ వయసు తగ్గింది!
 
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా రిలీస్ అవుతుంది అంటే ఆ హంగామా అంత ఇంత కాదు. ఏకంగా సినిమా కోసం కొన్ని కంపెనీలు హాలిడే ప్రకటించేస్తాయి కూడా. ఇప్పుడు గతంలో లాగా రజనీకాంత్ సినిమాలు స్లో గా చేయట్లేదు.
 
వేగం పెంచారు రజనీకాంత్‌. అరవైలలో ఇరవైల దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఒక సినిమా పూర్తి కావడం ఆలస్యం మరో సినిమా సైన్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ హీరోగా ‘దర్బార్‌’ చిత్రం తెరకెక్కుతోంది.
 
ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే స్టార్ట్‌ అయింది. అప్పుడే ఈ ప్రాజెక్ట్‌ తర్వాత చేయబోయే రెండు సినిమాలకు డేట్స్‌ ఇచ్చేశారట రజనీ. తనకు ‘ముత్తు, నరసింహ’ వంటి హిట్స్‌ ఇచ్చిన దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ డైరెక్షన్‌లో ఓ మూవీ, ‘చతురంగవైటైట్, ఖాకీ’ వంటి హిట్స్‌ ఇచ్చిన దర్శకుడు హెచ్‌వినోద్‌తో మరో సినిమా అంగీకరించారట.
 
ఈ మూడు సినిమాలతో రజనీ డైరీ 2021 వరకూ ఖాళీ లేదు. ఈ సినిమాలు పూర్తయిన తర్వాత 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల మీద పూర్తిస్థాయిలో దృష్టిపెట్టే ఆలోచనలో రజనీ ఉన్నట్టు తమిళనాడు టాక్‌. ‘దర్బార్‌’ 2020 సంక్రాంతికి రిలీజ్‌.Top