రోడ్డు పై ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రయత్నించిన వర్మ అరెస్ట్..?

Written By Aravind Peesapati | Updated: April 29, 2019 10:01 IST
రోడ్డు పై ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రయత్నించిన వర్మ అరెస్ట్..?

రోడ్డు పై ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రయత్నించిన వర్మ అరెస్ట్..?
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఆ సమయంలో రాష్ట్రంలో విడుదల అవకుండా ఏపీ టీడీపీ నాయకులు ఆపివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏపీలో ఎన్నికలు అయిపోవడంతో తాజాగా కోర్టు ఉత్తర్వుల మేరకు అనుమతులు తీసుకున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా నిర్మాతలు సినిమాను విడుదల చేస్తున్న నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్త వచ్చింది.
 
లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా మే ఒకటిన విడుదల చేస్తున్న సందర్బంగా ఆయన విజయవాడ నోవాటెల్ హోటల్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాలని తలపెట్టారు.కాని హోటల్ యాజమాన్యాన్ని బెదిరించి ప్రెస్ మీట్ పెట్టనివ్వకుండా అడ్డుకున్నారట. అలాగే ఇతర హోటళ్లలో కూడా ప్రెస్ కాన్పరెన్స్ పెట్టకుండా ఒక పెద్ద వ్యక్తి అడ్డుపడ్డారని వర్మ ఆరోపించారు. ఈ నేపద్యంలో ఆయన నడిరోడ్డు మీద ప్రెస్ మీట్ పెట్టబోతున్నానని ప్రెకటించారు. విజయవాడ పైపుల రోడ్డులోని ఎన్.టి.ఆర్.సర్కిల్ వద్ద సాయంత్రం నాలుగు గంటలకు తన ప్రెస్ మీట్ ఉంటుందని ఆయన తెలిపారు.
 
దీనికి ఎన్.టి.ఆర్.నిజమైన అబిమానులు కూడా రావచ్చని ఆయన చెప్పారు. ‘మీడియా మిత్రులకి, ఎన్‌టీఆర్‌ నిజమైన అభిమానులకి, నేనంటే అంతో, ఇంతో ఇష్టమున్న ప్రతివారికీ, నిజాన్ని గౌరవించే ప్రజలందరికీ మీటింగ్‌లో పాల్గొనటానికి ఇదే నా బహిరంగ ఆహ్వానమ’ని తెలిపారు. అయితే పోలీసులు ఇందుకు అంగీకరిస్తారా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది.Top