మహర్షి ట్రైలర్ టాక్: జర్నీ అఫ్ రిషి

మహర్షి ట్రైలర్ టాక్: జర్నీ అఫ్ రిషి

మహర్షి ట్రైలర్ టాక్: జర్నీ అఫ్ రిషి
 
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 25వ చిత్రం మహర్షి మే 9న విడుదలకానుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపారు మేకర్స్. ఈ ఈవెంట్ లో చిత్రం యొక్క ట్రైలర్ ను విడుదల చేశారు. ఇక ట్రైలర్ చూస్తుంటే సినిమాలో రిషి గా మూడు డిఫ్రెంట్ షేడ్స్ లో మహేష్ కనబడనున్నాడని తెలుస్తుంది. అందులో ఒకటి కాలేజ్ స్టూడెంట్ కాగా రెండవది సక్సెస్ ఫుల్ బిజినెస్ పర్సన్ అలాగే మూడవది రైతు పాత్ర.
 
ఈ రైతు పాత్ర గురించి ఎక్కువగా రివీల్ చేయలేదు కానీ సినిమాలో ఈ పాత్ర హైలైట్ అవుతుందని టాక్. ఎంటర్టైన్మెంట్ , ఎమోషన్స్ , యాక్షన్ ను అన్ని కలగలిపి ట్రైలర్ ను పర్ఫెక్ట్ గా కట్ చేశారు. ఆడియో డిస్సపాయింట్ చేసిన ట్రైలర్ మాత్రం సినిమా ఫై అంచనాలను పెంచింది.
 
వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా అల్లరి నరేష్, రవి అనే కీలక పాత్రలో కనిపించనున్నాడు. దిల్ రాజు , అశ్వినీదత్ , పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
 

For Trailer Click HereTop