పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించనున్న చిత్రం టైటిల్ `ఉప్పెన`
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఓ సినిమాను నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి `ఉప్పెన` అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ వద్ద దర్శకత్వ శాఖలో అసిస్టెంట్‌గా పనిచేసిన బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం కొన్ని రోజుల కిత్రం లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. కథకు ఎలాంటి టైటిల్ పెట్టాలనే దానిపై చాలా ఆలోచించాం. కథకు తగిన విధంగా `ఉప్పెన` టైటిల్ అయితే పక్కాగా సూట్ అవుతుందని ఆ టైటిల్‌నే నిర్ణయించాం. తమిళంలో వైవిధ్యమైన పాత్రలను పోషించి తనకుంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటుడు విజయ్ సేతుపతి ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించబోతున్నామని చిత్ర యూనిట్ తెలియజేసింది. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.