సినిమా ల మీద ఇంటరెస్ట్ లేని నందమూరి వారసుడు?

Written By Aravind Peesapati | Updated: June 02, 2019 10:22 IST
సినిమా ల మీద ఇంటరెస్ట్ లేని నందమూరి వారసుడు?

సినిమా ల మీద ఇంటరెస్ట్ లేని నందమూరి వారసుడు?
 
నందమూరి తారక రామారావు వారసుడిగా వెండితెరపై అద్భుతంగా రాణించారు నందమూరి బాలకృష్ణ. ఒకపక్క రాజకీయ నాయకుడిగా మరోపక్క సినిమా హీరోగా రెండు రంగాలలోనూ దూసుకెళ్ళిపోతున్న నందమూరి బాలకృష్ణ..తన కొడుకు నందమూరి మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ విషయంలో బాధ పడుతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. గతంలో నందమూరి బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ త్వరలో సినిమా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ ఇందుకోసం నందమూరి మోక్షజ్ఞ అమెరికా దేశంలోని వ్యాప్ నగరంలో ఫిల్మ్ అకాడమీలో నటన మెళుకువలు కూడా నేర్చుకుంటున్నట్లు అప్పట్లో ఇండస్ట్రీలో నుండి వార్తలు వినపడ్డాయి.
 
అయితే తాజాగా మాత్రం నందమూరి మోక్షజ్ఞ కు సినిమాల పై ఇంట్రెస్ట్ లేదని ఏదో చిన్న వ్యాపారం చేసుకుని బతికేద్దామని ఆలోచనలో ఉన్నారట. అయితే నందమూరి మోక్షజ్ఞ తీసుకున్న నిర్ణయంలో మాత్రం తాను కూడా జోక్యం చేసుకోకుండా పిల్లలు ఇష్ట ప్రకారం నడుచుకుంటే బాగుంటుందని బాలకృష్ణ కూడా ఎక్కువ ప్రెజర్ పెట్టకుండా ఉండాలనే ఆలోచనలో ఉన్నారట. అయితే నందమూరి అభిమానులు మాత్రం నందమూరి మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఇస్తే బాగుంటుందని మంచి లైఫ్ ఉంటుందని తండ్రికి తగ్గ గా తాతకు తగ్గ నటుడిగా రాణిస్తే నందమూరి వంశంలో నందమూరి మోక్షజ్ఞ ఏ ఎక్కువ ఫోకస్ అవుతారని కామెంట్ చేస్తున్నారు.Top