సమంత కాల్ షీట్ ల కోసం అమజాన్ ఎంత ఇచ్చిందో తెలుసా... నమ్మలేరు అసలు!

Written By Aravind Peesapati | Updated: July 14, 2019 15:49 IST
సమంత కాల్ షీట్ ల కోసం అమజాన్ ఎంత ఇచ్చిందో తెలుసా... నమ్మలేరు అసలు!

సమంత కాల్ షీట్ ల కోసం అమజాన్ ఎంత ఇచ్చిందో తెలుసా... నమ్మలేరు అసలు!
 
ఈ ఏడాది వరుసగా రెండు సక్సెస్ లతో మంచి జోరు మీద ఉంది సమంత. భర్త నాగచైతన్యతో కలిసి నటించిన మజిలీ సినిమాతో మొట్టమొదటి హిట్ అందుకున్న సమంత ఇటీవల నందినీరెడ్డి దర్శకత్వంలో నటించిన ఓ బేబీ సినిమాతో రెండో హిట్ అందుకుంది. సమంత ప్రధాన పాత్రలో వచ్చిన ఓ బేబీ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నిర్మాతలకు కనక వర్షం కురిపిస్తోంది. దీంతో సమంత లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా తాజాగా ఇటీవల సమంత ఓ వెబ్ సిరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, త్వరలో ఇది సెట్స్ పైకి వెళ్ళబోతుంది అనేది టాక్. డిజిటల్ స్ట్రీమింగ్ చానల్ అమెజాన్ ప్రైమ్ హిందీ, ఇంగ్లీష్ తో పాటు ప్రాంతీయ భాషలలో కూడా వెబ్ సిరిస్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సౌత్ లో తెలుగు తమిళంలో వెబ్ సిరీస్ సినిమాలు చేయాలని ఆలోచనలో అమెజాన్ ప్రైమ్ భారీగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సమంతతో కలిసి ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయించడం కోసం సమంత కాల్షీట్లకోసం అమెజాన్ సంస్థ సమంతాకి భారీగా డబ్బు ముట్టజెప్పినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి. దీంతో అక్షరాల ఎంతో తెలియదు గానీ అమెజాన్ ప్రైమ్ సమంత కి ఆఫర్ చేసిన ప్యాకీజీ గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో కథలు కథలుగా చర్చించుకుంటున్నారు.
Top