రేణూ దేశాయ్ రీ ఎంట్రీ ఫిక్స్ రో!

రేణూ దేశాయ్ రీ ఎంట్రీ ఫిక్స్ రో!

రేణూ దేశాయ్ రీ ఎంట్రీ ఫిక్స్ రో!
 
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న తర్వాత తన స్వస్థలం పూణేకు వెళ్ళిపోయారు రేణు దేశాయ్. తన ఇద్దరు పిల్లలతో కలిసి తన ప్రస్తుత జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న రేణుదేశాయ్ త్వరలో రెండో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇదిలావుండగా మొన్నటివరకు టీవీ షోలలో కనిపించిన రేణుదేశాయ్ తిరిగి మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైనట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి. విషయంలోకి వెళితే బెల్లంకొండ సినిమాలో ఆమె మరొకసారి నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బెల్లంకొండ నిర్మించబోయే టైగర్ నాగేశ్వర్ అనే సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నారు ఈ సినిమాలో రేణు దేశాయ్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. స్టువర్టుపురం ప్రాంతానికి చెందిన ఓ గజదొంగ జీవితం ఆధారంగా ఈ సినిమా రాబోతోంది. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు మాటలు రాస్తున్న సాయిమాధవ్ బుర్రా ఈ విషయాన్ని నిర్థారించారు. సినిమాలో రేణుదేశాయ్ పాత్ర చాలా బాగుంటుందంటున్నారాయన. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో కి రావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు రేణూ దేశాయ్ రీ ఎంట్రీ ఫిక్స్ రో అంటూ కామెంట్లు పెడుతున్నారు.Top