అల్లూ అరవింద్ ఎన్‌టి‌ఆర్ తోనే రామాయణం చేస్తా అని పట్టు బట్టారా?

అల్లూ అరవింద్ ఎన్‌టి‌ఆర్ తోనే రామాయణం చేస్తా అని పట్టు బట్టారా?

అల్లూ అరవింద్ ఎన్‌టి‌ఆర్ తోనే రామాయణం చేస్తా అని పట్టు బట్టారా?
 
టాలీవుడ్ ఇండస్ట్రీ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ రామాయణం తెరకెక్కించబోతున్నారని ఆ సినిమాలో రామ్ చరణ్ రాముడి పాత్రలో నటిస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు కోసం అల్లు అరవింద్ భారీ స్థాయిలో డబ్బులు ఖర్చు పెట్టబోతున్నట్లు కూడా అనేక వార్తలు వినపడ్డాయి. అయితే ఈ ప్రాజెక్టు గురించి ఇటీవల రామ్ చరణ్ తో అల్లు అరవింద్ డిస్కషన్ పెట్టగా పౌరాణిక సినిమాలు చేయడం నా వల్ల కాదని దీంతో అల్లు వారిని ఇలాంటి పాత్రలను చేయగలిగే ఏకైక హీరో జూనియర్ ఎన్టీఆర్ అని... దీంతో అల్లు అరవింద్ ఎన్టీఆర్ తోనే రామాయణం ప్రాజెక్ట్ చేయాలనే ఆలోచనలు ఉన్నట్లు సమాచారం. వేరే ఏ హీరోతో కాకుండా కేవలం ఎన్టీఆర్ తోనే రామాయణం ప్రాజెక్టు చేయడానికి అల్లు అరవింద్ పట్టుబట్టినట్లు మెగా కాంపౌండ్ లో వార్తలు వినపడుతున్నాయి. మామూలుగా పౌరాణిక చిత్రాలు ఎక్కువగా వెండితెరపై పండించేది ప్రేక్షకులను అలరించే హీరోలు ఎవరైనా ఉన్నారంటే నందమూరి హీరోల అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా తాతగారు సీనియర్ ఎన్టీఆర్ బాటలో పౌరాణిక పాత్రల్లో నటించి ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడు అని అనిపించుకున్నారు. మాస్టర్ ఎన్టీఆర్ గా మొదటి సినిమా 'బాలల రామాయణం' లో నటించి అందరినీ ఆకర్షించిన ఎన్టీఆర్.. 'యమదొంగ' లో కుర్ర యముడిగా నటించి అదరగొట్టారు. ఇక 'జైలవకుశ' సినిమాలో రావణ పాత్రలో మెరిసి అందరినీ మెప్పించారు. ఇలా రాముడు.. రావణుడు.. యముడు.. ఎలాంటి పాత్రనైనా ఎన్టీఆర్ చక్కగా పోషించడంతో అల్లు అరవింద్ ఎన్టీఆర్ తన ఈ సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇదే క్రమంలో అల్లు అరవింద్ ఎన్టీఆర్ తోనే సినిమా చేస్తే బాగుంటుందని సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా కామెంట్లు పెడుతున్నారు.Top