'హైప్ పెంచి తెలియని వాళ్ళని పట్టుకొస్తారా' స్టార్ మా మీద కోపంగా ఉన్న జనాలు?

'హైప్ పెంచి తెలియని వాళ్ళని పట్టుకొస్తారా' స్టార్ మా మీద కోపంగా ఉన్న జనాలు?

'హైప్ పెంచి తెలియని వాళ్ళని పట్టుకొస్తారా' స్టార్ మా మీద కోపంగా ఉన్న జనాలు ?
 
బిగ్ బాస్ 3 సీజన్ మొదలు అయ్యింది .. మొదటి రెండు సీజన్ లూ హిట్ అవ్వడం తో మేకర్స్ మూడో సీజన్ కి కింగ్ నాగార్జున ని తీసుకుని వచ్చారు .. ఆయన పర్ఫెక్షన్ తో మొదటి రోజు నుంచే బెస్ట్ హోస్ట్ అనిపించుకున్నారు అంతవరకూ బాగానే ఉన్నా బిగ్ బాస్ 3 కంటెస్టంట్ ల వరకూ వచ్చేసరికి మాత్రం చాలా మంది పెదవి విరుస్తున్నారు .. మా టీవీ - స్టార్ మా వారికి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు అందుతున్నాయి అనీ సోషల్ మీడియా లో వీళ్లలో నలుగురు ఐదుగురు తప్ప మిగితా ఎవ్వరూ తమకి తెలీదు అంటూ కోప్పడుతున్నారు జనాలు.
 
హోస్ట్ అంతా బాగా చేస్తుంటే ప్రేక్షకుల లో అంతా బాగా హైప్ వచ్చిన తరుణం లో ఇలా తెలిసీ తెలీయని వాళ్ళని పెట్టడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. మొదటి సీజన్ లో .. నవదీప్ , అర్చన , హరితేజ , ప్రిన్స్ , శివ బాలాజీ , సమీర్ , ధనరాజ్ , సంపూర్ణేష్ , కల్పనా , మధు , కత్తి కార్తీక , కత్తి మహేశ్ ఇలా దాదాపు గా అన్నీ తెలిసిన మొఖాలనే పెట్టి రెండో సీజన్ లో కూడా పరవాలేదు అనిపించి మూడో సీజన్ కి హైప్ పెరగగానే తెలియని మొఖాలని పట్టుకొస్తారా అంటూ జనం కోప్పడుతున్నారు .Top