రేణు దేశాయ్ ఎంత మంచిదో ఈ విషయం తో అందరికీ అర్థమవుతుంది..!

Written By Aravind Peesapati | Updated: August 05, 2019 13:46 IST
రేణు దేశాయ్ ఎంత మంచిదో ఈ విషయం తో అందరికీ అర్థమవుతుంది..!

రేణు దేశాయ్ ఎంత మంచిదో ఈ విషయం తో అందరికీ అర్థమవుతుంది..!
 
తాజాగా ఇటీవల ఫ్రెండ్షిప్ డే నాడు ‘మిలియన్ మామ్స్’ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు డాక్టర్ మణి పవిత్ర ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి సంచలన విషయాలు బయట పెట్టింది. హైదరాబాదులో తనకు రేణుదేశాయ్ తో మంచి స్నేహబంధం ఉందని ఆమెది స్వచ్ఛమైన కల్మషం లేని మనసు అని అద్భుతమైన వ్యక్తిత్వం గల వ్యక్తి అని తెలిపారు. అంతేకాకుండా తమ ‘మిలియన్ మామ్స్’ ఆర్గనైజేషన్ గురించి చెప్పడానికి వెళ్లినప్పుడు ఎంతో ఆసక్తిగా వింటూ కూర్చున్నారన్నారు. గంటసేపు తామిద్దరం మాట్లాడుతూనే ఉన్నామన్నారు. స్వార్థం అన్నది కనిపించలేదన్నారు. ఆమెలోని ఆ స్వచ్ఛతే తనకు నచ్చిందన్నారు. ఏమీ ఆశించకుండా.. తనకు రేణు సహకరించారన్నారు. ఆమె తర్వాత తమ సంస్థలోకి ఎంతో మంది వచ్చారని తెలిపారు. జీవితంలో ఎవరో ఒకరి కోసం ఎదురు చూస్తూ ఉంటామని.. అలాంటి వ్యక్తే రేణు అని చెప్పారు. ఈ సంస్థ తల్లుల ఆరోగ్యం గురించి ఆనందం గురించి పనిచేస్తుందని ఇటువంటి సంస్థకు రేణుదేశాయ్ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారని డాక్టర్ మణి పవిత్ర పేర్కొంది.Top