చిరంజీవి సినిమా పై మండిపడుతున్న అభిమానులు..!

Written By Aravind Peesapati | Updated: August 09, 2019 10:55 IST
చిరంజీవి సినిమా పై మండిపడుతున్న అభిమానులు..!

చిరంజీవి సినిమా పై మండిపడుతున్న అభిమానులు..!
 
ఎప్పుడెప్పుడా అని చిరంజీవి సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులు ఉన్న కొద్ది సినిమా ఆలస్యం అవుతున్న క్రమంలో సైరా సినిమా యూనిట్ పై మండిపడుతున్నారు. చిరంజీవి కెరీర్ లోనే దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ని రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ముఖ్యంగా సినిమా గురించి ఒక వార్త కూడా బయటకు రాకుండా అసలు షూటింగ్ జరుగుతుందా లేదా అన్న సందేహం వచ్చే విధంగా వ్యవహరించడం పై ఎటువంటి అప్డేట్లు సినిమా యూనిట్ బయటకు చెప్పకపోవడం పై మండి పడుతున్నారు. అక్టోబర్ లో సినిమా విడుదలవుతుందని ఒకపక్క చెబుతూనే మరోపక్క సినిమా గురించి ఆగస్టులో మేకింగ్ వీడియో విడుదల అవుతుందని ప్రచారం చేసి ఇప్పటివరకు సైరా సినిమా కి సంబంధించిన చిన్న పోస్టర్లు కూడా విడుదల చేయకపోవడంపై మెగా అభిమానులు ‘సైరా’ సినిమా యూనిట్ పై మండిపడుతున్నారు. అంతేకాకుండా ఈ నెలలో చిరంజీవి పుట్టిన రోజు వస్తున్న సందర్భంగా సినిమాకి సంబంధించి ఏదో ఒక వీడియో విడుదల చేయాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.Top