యాంకర్ సుమ నీ నాలాగా బట్టలు వేసుకోమని చెప్పండి అంటున్న అనసూయ..?

యాంకర్ సుమ నీ నాలాగా బట్టలు వేసుకోమని చెప్పండి అంటున్న అనసూయ..?

యాంకర్ సుమ నీ నాలాగా బట్టలు వేసుకోమని చెప్పండి అంటున్న అనసూయ..?

 
యాంకర్ అనసూయ మరియు సుమ తెలుగులో టాప్ యాంకర్లుగా రాణిస్తున్నారు. ఈ క్రమంలో హాట్ యాంకర్ అనసూయ ఒకపక్క యాంకరింగ్ చేస్తూనే మరోపక్క సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన అవకాశాలు అందుకుంటుంది. రంగస్థలం సినిమాలో రంగమ్మ అత్త పాత్రలో అద్భుతంగా నటించిన అనసూయ ఇటీవల కథనం చిత్రంలో నటించింది. అయితే అనసూయ కి సోషల్ మీడియాలో తిప్పలు తప్పడం లేదు. గతంలో ఒక అభిమాని కి సంబంధించిన సెల్ ఫోన్ పగలగొట్టిన ఘటన యాంకర్ అనసూయ కి తలనొప్పులు తీసుకురాగా ఆ సమయంలో సోషల్ మీడియాకు దూరం అయింది. అయితే సినిమాల్లో వరుసగా అవకాశాలు వస్తున్న తరుణంలో సోషల్ మీడియా కి తిరిగి వచ్చిన అనసూయ తన సినిమాకి సంబంధించిన అలాగే తనపై వచ్చిన రూమర్స్ గట్టి గట్టిగానే కౌంటర్లు వేస్తూ వస్తోంది. ఇటువంటి తరుణంలో డ్రెస్ విషయంలో తాజాగా యాంకర్ సుమ ని ఉద్దేశించి అనసూయపై కొంత మంది నెటిజన్లు ట్రోలింగ్ చేశారు. దీంతో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ తానిప్పుడు ట్రోలింగ్ ని పట్టించుకోవడం మానేశానని అంటోంది.తన డ్రెస్సింగ్ స్టైల్ తన ఇష్టం అని అంటోంది. నార్త్ ఇండియన్ హీరోయిన్లు ఎక్స్పోజింగ్ చేస్తే చూస్తారు.. గ్లామరస్ గా ఉందని పొగిడేస్తారు. కానీ నాపై మాత్రం బూతులు తిడుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇక తన యాంకరింగ్ గురించి వస్తున్న విమర్శలపై కూడా అనసూయ స్పందించింది. సుమతో పోలిక పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నేను, సుమ, ఝాన్సీ లాంటి యాంకర్స్ పెళ్ళైనవాళ్ళమే. ఎవరి వెసులుబాటుకు తగ్గట్లుగా వారు యాంకరింగ్ చేస్తున్నారు. కానీ వారి అనుభవం ముందు నేను తక్కువే. అలాగని కొందరు సుమని చూసి నేర్చుకో అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. సుమలా నేనెందుకు ఉండాలి.. ఆమెనే నాలాగా ఉండమని చెప్పొచ్చుగా అని అనసూయ బదులిచ్చింది. ప్రేక్షకుల అభిరుచి మేరకు కాలాన్నిబట్టి యాంకరింగ్ డ్రెస్సింగ్ ఎలా చేయాలో సుమ కు...మీరే చెప్పొచ్చుగా అంటూ నెటిజన్లను ఉద్దేశించి అనసూయ రెచ్చిపోయింది. ఎవరు ఎవరికి సలహాలు ఇవ్వకూడదని ఈ సందర్భంగా తెలిపింది.Top