సాహో ప్రీ రిలీజ్ వేడుకలో ఏడ్చేసిన ప్రభాస్..!

Written By Aravind Peesapati | Updated: August 19, 2019 14:09 IST
సాహో ప్రీ రిలీజ్ వేడుకలో ఏడ్చేసిన ప్రభాస్..!

సాహో ప్రీ రిలీజ్ వేడుకలో ఏడ్చేసిన ప్రభాస్..!

 
సాహో సినిమా మరి కొద్ది రోజులలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు మొదలైపోయాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా ట్రైలర్ చూసిన చాలామంది సినిమా హాలీవుడ్ స్టైల్ లో ఉందని కామెంట్ చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో రామోజీ ఫిలిం సిటీలో హైదరాబాద్ నగరంలో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ప్రభాస్ ఏడ్చేశాడు. వేల సంఖ్యలో అతిరథ మహారథుల సమక్షంలో జరిగిన సాహో ప్రీ రిలీజ్ వేడుక చాలా భావోద్వేగ వాతావరణంలో అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా వేడుకకు అతిథిగా వచ్చిన రాజమౌళి మాట్లాడుతుండగా ప్రభాస్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఇదే క్రమంలో పెదనాన్న కృష్ణం రాజు మాట్లాడుతున్న సందర్భంలో కూడా ప్రభాస్ కంటతడి పెట్టుకోవడం అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే సైలెంట్ గా నవ్వుకుంటూ కనిపించే ప్రభాస్ ఒక్కసారిగా అలా కనిపించే సరికి టీవీ చూస్తున్న చాలా మంది అభిమానులు ఆశ్చర్యపోయారు. గతంలో బాహుబలి ఆడియో వేడుకలో రాజమౌళి అన్న కీరవాణి పాటకు ఎమోషనల్ అయినట్టు ఇప్పుడు అదే ప్లేస్ లో మళ్ళీ ప్రభాస్ కూడా కొంత ఎమోషనల్ అయ్యాడు. మొత్తంమీద ప్రీ రిలీజ్ వేడుకలో ప్రభాస్ కంటతడి పెట్టడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ సినిమా ఆగష్టు చివరి వారంలో భారీ ఎత్తున విడుదల కానుంది.Top