ఇస్మార్ట్ శంకర్ సినిమా కి లాభం వచ్చింది ఎంతో తెలుసా..?

Written By Aravind Peesapati | Updated: August 19, 2019 14:10 IST
ఇస్మార్ట్ శంకర్ సినిమా కి లాభం వచ్చింది ఎంతో తెలుసా..?

ఇస్మార్ట్ శంకర్ సినిమా కి లాభం వచ్చింది ఎంతో తెలుసా..?

 
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా విడుదలైన ఇస్మార్ట్ శంకర్ సినిమా విడుదలయి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది . జులై 18 వ తారీఖు న విడుదలైన ఈ సినిమా రామ్ అభిమానులను మరియు పూరి జగన్నాథ్ అభిమానించే చాలామంది ఇస్మార్ట్ శంకర్ బాగా ఆకట్టుకుంది . అయితే చాలా కాలం తర్వాత పూరి జగన్నాధ్ కి సూపర్ హిట్ పడటంతో..ఇండస్ట్రీలో ఉన్న చాలామంది ప్రముఖులు...స్టార్ హీరోలు సోషల్ మీడియాలో పూరి జగన్నాథ్ ఈజ్ బ్యాక్ అని పొగడ్తల వర్షం కురిపించారు. ఇటువంటి నేపథ్యంలో సినిమా పాస్టర్ కావడంతో ఈ సినిమా కలెక్షన్లు దాదాపు 38 నుంచి 40 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసినట్లు సమాచారం. వచ్చిన లెక్కల్ని బట్టి చూస్తే రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ఇది. ఇన్నాళ్లూ రామ్ ...హిట్ రేంజ్ అంటే 25 కోట్ల వరకూ ఉంది. ఈ సినిమాతో ఒక్కసారిగా 40 కోట్లకు జంప్ చేసింది. ఇక ఖర్చు తో పోల్చుకుని లాభం చూస్తే...పూరి జగన్నాథ్ కు ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్. ఈ సినిమాని 17 కోట్లుకు అమ్మితే...లాభం 22 కోట్లు అదీ కేవలం థియోటర్ రెవిన్యూ నుంచి వచ్చింది. డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్, మిగతా భాషల డబ్బింగ్ రైట్స్ అదనంగా మిగులుతాయి. ఈ సందర్భంగా హీరో రామ్ మాట్లాడుతూ..ఈ సినిమా పూర్తిగా తన గత చిత్రాలకు భిన్నంగా...నాకు మంచి క్యారెక్టరైజేషన్ ఈ సినిమా ద్వారా వచ్చిందని సినిమాకి మంచి సంగీతం మరియు అదిరిపోయే రీతిలో గ్లామర్ పాత్రలో హీరోయిన్ లో నటించాలని ఈ సినిమా విజయం ప్రతి ఒక్కరిది అని రామ్ పేర్కొన్నారు.Top