దేవరకొండను ఫాలో అవుతున్న చిరు..?

Written By Aravind Peesapati | Updated: August 19, 2019 14:20 IST
దేవరకొండను ఫాలో అవుతున్న చిరు..?

దేవరకొండను ఫాలో అవుతున్న చిరు..?

 
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా సైరా. ఈ క్రమంలో త్వరలో చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మెగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వడానికి ‘సైరా’ సినిమా యూనిట్ గట్టిగా ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇప్పటిదాకా సినిమాకి సంబంధించిన ప్రమోషన్ విషయంలో సినిమా యూనిట్ చాలా వెనకబడి పోవడంతో ఈసారి ఆగస్టు 20 నుండే అనగా సినిమా టీజర్ విడుదలవుతున్న సందర్భం నుండే ప్రమోషన్ అదిరిపోయే రీతిలో చేయడానికి...సైరా టీం ఈ టీజర్ నిమిత్తం భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇటువంటి క్రమంలో విజయ్ దేవరకొండ ఫార్ములాను చిరంజీవి ఫాలో అవుతున్నట్లు ఫిలింనగర్ లో టాక్ వినపడుతుంది. విషయంలోకి వెళితే విడుదల అవుతున్న టీజర్ విషయంలో ఇటీవల విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ స్ట్రాటజీ సైరా టీం ఫాలో అవుతున్నారు. డియర్ కామ్రేడ్ సినిమా మాదిరిగానే సైరా సినిమా కూడా నాలుగు భాషల్లో విడుదల కానుంది. దీంతో బాలీవుడ్ నుండి - కోలీవుడ్ నుండి - సాండల్ వుడ్ నుండి మల్లువుడ్ నుండి ఒక్కో స్టార్ ను ఎంచుకొని ప్రమోషన్స్ కోసం వారి ఇమేజ్ ను వాడుకున్నారు. సినిమాలో ఒక పాటను కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి తో అదే పాటను మలయాళంలో దుల్కర్ తో పాడించారు కూడా. ఇప్పుడు సైరా విషయంలో అదే జరుగుతోంది. రెండ్రోజుల్లో విడుదల కానున్న టీజర్ ను ఒక్కో భాషలో ఒక్కొ సూపర్ స్టార్ తో వాయిస్ ఓవర్ చెప్పిస్తున్నారట. ఇప్పటికే అన్ని భాషల్లో స్టార్స్ వాయిస్ ఓవర్ చెప్పేసారని తెలుస్తుంది. తమిళ్ లో సూపర్ స్టార్ రజిని వాయిస్ ఓవర్ తో మలయాళంలో మోహన్ లాల్ కన్నడలో యష్ వాయిస్ ఓవర్ తో సైరా టీజర్ రిలీజ్ అవుతుంది. తెలుగులో పవర్ స్టార్ వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు ఫిలింనగర్లో టాక్.Top