'సాహో' సినిమా గురించి క్లారిటీ ఇచ్చిన లోకేష్..!

Written By Aravind Peesapati | Updated: August 20, 2019 13:13 IST
'సాహో' సినిమా గురించి క్లారిటీ ఇచ్చిన లోకేష్..!

'సాహో' సినిమా గురించి క్లారిటీ ఇచ్చిన లోకేష్..!

 
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో సినిమా త్వరలో విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభాస్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గురించి చేసిన కామెంట్స్ తెలుగుదేశం పార్టీ నేతలకు మరిచిపోయేలా చేశాయి. ఇంతకీ జరిగిన విషయం ఏమిటంటే ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్ కి ఏపీలో జగన్ పరిపాలన ఏవిధంగా ఉంది అన్న ప్రశ్న ఎదురయింది. దీనికి ప్రభాస్ సమాధానమిస్తూ పరిపాలన చాలా బాగుంది యువకుడైన సీఎం కాబట్టి ఇంకా చాలా మంచి పనులు చేసే అవకాశం ఉంది చూద్దామని సమాధానమిచ్చారు. దీంతో వెంటనే తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా ప్రభాస్ పై మరియు సాహో సినిమా పై రకరకాల కామెంట్ చేయడం స్టార్ట్ చేసింది. దీంతో ఈ విషయం పెద్దగా అవుతున్న క్రమంలో టిడిపి నేత ,మాజీ మంత్రి లోకేష్ క్లారిటీ ఇచ్చారు. ఆ సినిమా విజయావకాశాలు దెబ్బతీసేలా ప్రభాస్ పరువుని కించపరిచే విధంగా టిడిపి ప్రయత్నిస్తోందన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. టిడిపి క్యాడర్ కు ఈ సినిమాకు సంబందించి ఏవో సూచనలు చేసినట్లు ఒక వెబ్ సైట్ లో వచ్చిన వార్తలు నిజం కావని ఆయన స్పష్టం చేశారు. తాము సాహోను వ్యతిరేకించబోమని స్పష్టం చేశారు. సాహోను విజయవంతం చేయాలంటూ ట్విటర్ వేదికగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సినిమా విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్నట్లే తాను కూడా ఎదురుచూస్తున్నానని ఆయన అన్నారు. సినిమా బ్లాక్‌బస్టర్ కావాలని లోకేశ్ అన్నారు.Top