Advertisement

Advertisement

Advertisement

సైరా టీజర్ అదిరిపోయింది..! ఇండస్ట్రీలో ఎవరేమన్నారంటే..!

by Aravind Peesapati | August 21, 2019 12:43 IST
సైరా టీజర్ అదిరిపోయింది..!  ఇండస్ట్రీలో ఎవరేమన్నారంటే..!

సైరా టీజర్ అదిరిపోయింది..! ఇండస్ట్రీలో ఎవరేమన్నారంటే..!

 
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా సైరా. తన జీవితంలో ఇటువంటి సినిమా చేయాలని ఎప్పటి నుండో కోరిక ఉందని తన కోరిక తన కొడుకు రామ్ చరణ్ తీర్చడం జరిగిందని ముంబైలో టీజర్ విడుదల కార్యక్రమంలో చిరంజీవి పేర్కొనడం జరిగింది. ఈ క్రమంలో చాలా సంవత్సరాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి టీజర్ విడుదల అవటం తో సోషల్ మీడియాలో మెగా అభిమానులు పండగ చేసుకున్నారు. దాదాపు చాలా కాలం తర్వాత మెగా కాంపౌండ్ నుండి మెయిన్ హీరో సినిమా టీజర్ విడుదలైన క్రమంలో సోషల్ మీడియాలో మెగా అభిమానుల హడావుడి తారాస్థాయికి చేరుకుంది. ముఖ్యంగా టీజర్ లో పవన్ కళ్యాణ్ వాయిస్ ఇవ్వటంతో సినిమా టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలామంది సైరా సినిమా టీజర్ చూసి చిరంజీవి చాలా కష్టపడ్డారని ఇటువంటి వయసులో కూడా చిరంజీవి సినిమా కోసం కష్టపడటం అందరికీ ఆదర్శమని సోషల్ మీడియాలో నెటిజన్ల కామెంట్లు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది ప్రముఖులు చిరంజీవిపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. సైరా అదుర్స్ అంటూ ఎవరికి వారు సైరా సినిమా గురించి సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను చెబుతున్నారు. ఇంతకీ ఇండస్ట్రీలో ‘సైరా’ సినిమా గురించి ఎవరేమన్నారంటే…
 
వంశీ పైడిపల్లి : ‘సైరా’ టీజర్‌ అద్భుతంగా ఉంది. ఇది మెగాస్టార్‌ చిరంజీవి అంకితభావం, ఆయనకు వృత్తిపట్ల ఉన్న ఇష్టాన్ని తెలుపుతోంది. మొత్తం చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్.
 
సుధీర్‌బాబు : అమితాబ్‌, చిరంజీవిని ఒకే తెరపై చూస్తానని కనీసం కలలో కూడా అనుకోలేదు. ‘సైరా’ అద్భుతంగా ఉంది. చాలా ఉత్సుకతగా ఉంది.
 
సాయిధరమ్‌ తేజ్‌ : చరిత్ర మనల్ని ఎప్పటికీ మరిచిపోలేదు.
 
వరుణ్‌తేజ్‌ : నమ్మలేకపోతున్నా.. అద్భుతమైన టీజర్‌. ఈ సినిమా విడుదల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా.
 
రాయ్‌ లక్ష్మి : ఓ మై గాడ్‌ ఇది నిజమా?.. నేను చూసిన ఈ టీజర్‌ ఎలా ఉందో మాటల్లో చెప్పలేకపోతున్నా. చిరంజీవి సర్‌ మీపై నాకున్న అభిమానం ఎంత పెరిగిందో చెప్పడానికి మాటలు సరిపోవడం లేదు. మీరు ఊహాతీతం. ‘సైరా’ టీజర్‌కు బిగ్‌ సెల్యూట్‌. కుడోస్‌ టు టీమ్‌.
 
మంచు మనోజ్‌ : మిత్రమా రామ్‌ చరణ్‌ నీ నిర్మాణ విలువలు అదుర్స్‌. ఎంత అద్భుతమైన టీజర్‌.. ఒళ్లు గగుర్పొడిచింది. చిరంజీవి సర్‌ను వెండితెరపై చూడాలని ఆతృతగా ఉంది. మొత్తం చిత్ర బృందానికి నా అభినందనలు.
 
రామజోగయ్య శాస్త్రి : ఆ ‘ఠీవి’ పేరు చిరంజీవి.
 
నవదీప్‌ : సై.. సైరా.
 
మంచు లక్ష్మి : చిరంజీవి అంకుల్‌ ఎనర్జీ చూసి నాకు ఆశ్చర్యమేసింది. అందుకే మిమ్మల్ని మెగాస్టార్‌ అన్నారు. రామ్‌ చరణ్‌కు శుభాకాంక్షలు. సినిమా చూడాలని చాలా ఆతృతగా ఉంది.
 
హరీష్‌ శంకర్‌ : టీజర్‌ అద్భుతం.
 
సంపత్‌ నంది : సూపర్‌ టీజర్‌. తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణం. చిరంజీవి సర్‌, వన్ టూ సినిమా యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు.


Advertisement


Advertisement

Top