`డియ‌ర్ కామ్రేడ్‌` ట్రైల‌ర్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్‌.. జూలై 26న తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్‌

Written By Aravind Peesapati | Updated: July 16, 2019 17:42 IST
`డియ‌ర్ కామ్రేడ్‌` ట్రైల‌ర్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్‌.. జూలై 26న తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్‌

`డియ‌ర్ కామ్రేడ్‌` ట్రైల‌ర్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్‌.. జూలై 26న తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్‌
 
విజ‌య్ దేవ‌ర‌కొండ, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టిస్తోన్న చిత్రం `డియ‌ర్ కామ్రేడ్‌`. `ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్‌` అనేది ట్యాగ్ లైన్‌. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి(సి.వి.ఎం), య‌ష్ రంగినేని సంయుక్త‌గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో ద‌క్షిణాదిన స‌త్తా చాట‌డానికి సిద్ధ‌మ‌య్యారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. జూలై 26న ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది.
 
ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు మాట్లాడుతూ ``ఇటీవ‌ల ద‌క్షిణాది భాష‌లైన తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశాం. కంటెంట్‌, ఇన్‌టెన్సిటీ, ల‌వ్‌, ఎమోష‌న్స్ అన్నీ ఎలిమెంట్స్‌తో సినిమా ఉంటుంద‌ని తెలియ‌జేసేలా బ్యూటీఫుల్‌గా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశాం. అలాగే ట్రైల‌ర్‌ తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌లైంది. . ఈ ట్రైల‌ర్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు ట్రైల‌ర్‌కు 13 మిలియ‌న్ వ్యూస్ వ‌చ్చాయి. అలాగే ఇప్ప‌టికే విడుద‌లైన సాంగ్స్‌కు, టీజ‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. . ఈ నెల 12న బెంగ‌ళూరు, 13న కొచ్చిలో జ‌రిగిన మ్యూజిక్ ఫెస్టివ‌ల్స్ గ్రాండ్ స‌క్సెస్ అయ్యాయి. బెంగ‌ళూరులో య‌శ్ ముఖ్య అతిథిగా హాజ‌రైయ్యారు. ఈ నెల 18న చెన్నైలో 19న హైద‌రాబాద్‌లో మ్యూజిక్ ఫెస్టివ‌ల్స్‌ను నిర్వ‌హించున్నాం. అలాగే సినిమాను జూలై 26న ద‌క్షిణాది భాష‌ల్లో.. ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం`` అన్నారు.Top