118 హిట్టా ప్లాపా ? ఎక్స్ క్లూజివ్ ప్రివ్యూ !

118 హిట్టా ప్లాపా ? ఎక్స్ క్లూజివ్ ప్రివ్యూ !

చెప్పుకోదగ్గ కొత్త సినిమాలు లేక బాక్స్ ఆఫీస్ డల్ గా మారిన నేపథ్యంలో మార్చ్ 1 రానున్న నందమూరి కళ్యాణ్ రామ్ 118 మీదే అందరి చూపు ఉంది. టాక్ బాగుంటేనే ఇలాంటివి నిలబడతాయి. అందుకే అడ్వాన్స్ బుకింగ్స్ ఏ మాత్రం ఆశాజనకంగా లేవు. గత ఏడాది ఎమ్మెల్యే, నా నువ్వేతో ప్రయోగాలు చేయబోయి తీవ్రమైన చేదు ఫలితాలు అందుకున్న కళ్యాణ్ రామ్ కు ఇది హిట్ కావడం చాలా అవసరం.
 
పైగా పరిశ్రమకు వచ్చి ఇన్నేళ్ళైనా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ కానీ మార్కెట్ కానీ సంపాదించుకోవడంలో కళ్యాణ్ రామ్ సక్సెస్ కాలేకపోయాడు. ఇప్పుడు 118 రూపంలో తనకో మేజర్ బ్రేక్ దక్కుతుందనే నమ్మకం అయితే గట్టిగానే కనిపిస్తోంది. కెవి గుహన్ ప్రముఖ ఛాయాగ్రాహకులుగానే పరిచయం. ఈయన ఇప్పటిదాకా ఒకే ఒక్క తమిళ సినిమాకు దర్శకత్వం వహించారు. అది మన హ్యాపీ డేస్ రీమేకే. ఇప్పుడిది రెండోది. టాలీవుడ్ లో మొదటిది
 
రెగ్యులర్ కమర్షియల్ సబ్జెక్టు కాకుండా థ్రిల్లర్ తీసుకున్న గుహన్ ట్రైలర్ ద్వారా ఏదో కంటెంట్ బలంగా ఉందనే అభిప్రాయం అయితే కలిగించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటే చాలు పోటీ లేని బాక్స్ ఆఫీస్ లో సేఫ్ గా బయటికి రావొచ్చు. ఆ రోజు అజిత్ విశ్వాసం తప్ప ఇంకే పోటీ లేదు. దాని మీదా ఏమంత బజ్ లేదు కాబట్టి ఈ అవకాశాన్ని వాడుకోవాలి.
 
నివేదా థామస్ షాలిని పాండే హీరోయిన్లుగా నటించిన 118 క్రైం థిల్లర్. అంతుచిక్కని రహస్యం కోసం హీరో చేసే వేటే దీని కథాంశం. లైన్ లో ఏమంత కొత్తదనం లేదు కానీ కథనం కనక కట్టిపడేసేలా ఉంటె మాత్రం కళ్యాణ్ రామ్ కు బ్రేక్ దొరికినట్టే. చూద్దాంTop