24 గంటలూ థియేటర్ లలో సినిమా లే!

Advertisement

by Aravind Peesapati | June 10, 2019 13:49 IST
Follow Xappie
24 గంటలూ థియేటర్ లలో సినిమా లే!

24 గంటలూ థియేటర్ లలో సినిమా లే!
 
గత కొంతకాలంగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంలో కోలీవుడ్ ఇండస్ట్రీ లో 24 గంటలు సినిమా ప్రదర్శన అనేది పెండింగ్లో ఉంది. ఈ విషయంపై చాలా వాదనలు కోలీవుడ్ ఇండస్ట్రీ లో జరిగిన..తాజాగా అక్కడి ప్రభుత్వం 24 గంటల సినిమాల ప్రదర్శనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో తలలు పట్టుకుంటున్నారు థియేటర్ యజమానులు. ఎందుకంటే ఉన్న నాలుగు ఆటలకే జనంతో ఎలా నింపాలో అర్థం కాక ఉంటే ఇప్పుడీ రోజు మొత్తం షోలు ఏంటని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇది కేవలం స్టార్ హీరోలకు బెనిఫిట్ కలిగించేందుకు తీసుకున్న నిర్ణయమని అంతేతప్ప వీటి వల్ల చిన్న మరియు మీడియం రేంజ్ మూవీస్ కి నయా పైసా ప్రయోజనం లేదని చెబుతున్నారు. ఇందులో నిజం లేకపోలేదు. రజనికాంత్ విజయ్ అజిత్ లాంటి వాళ్ళ సినిమాలు తెల్లవార్లూ వేసినా జనం వస్తారు. అంతగా ఇమేజ్ లేని హీరోలైతే సెకండ్ షోకే చిల్లర లెక్కబెట్టుకునే పరిస్థితి ఉంది దీన్ని ఓ ఆరు నెలల పాటు పరిశీలించి అప్పుడు విశ్లేషించే ఆలోచనలో ఉన్నారు నిపుణులు.


Advertisement


Advertisement

Top