చింతమనేని పై కేసు పెట్టాలని జనసేన నాయకులకు సూచించిన పవన్..!

Written By Xappie Desk | Updated: January 13, 2019 14:57 IST
చింతమనేని పై కేసు పెట్టాలని జనసేన నాయకులకు సూచించిన పవన్..!

ఇటీవల జిల్లాల వారీగా పార్టీ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ కృష్ణా మరియు పశ్చిమ గోదావరి జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జిల్లాకు చెందిన జనసేన పార్టీ కార్యకర్తలు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బడుగు బలహీన వర్గాల ప్రజలను దళితులను వేధిస్తున్నారని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అట్టడుగు స్థాయి ప్రజల జోలికి వెళ్తే వాళ్ళ జీవితాలతో ఆడుకుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని అన్నారు. అంతేకాకుండా తాను కులం నమ్ముకుని మరియు మతం నమ్ముకుని రాజకీయాల్లోకి రాలేదని మానవత్వం బట్టే రాజకీయాలు చేస్తానని మాట్లాడుతూ వెంటనే రెండు జిల్లాల జనసేన పార్టీ నాయకులతో చింతమనేని ప్రభాకర్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని సూచించారు. అంతేకాకుండా పార్టీ సంస్థాగత నిర్మాణానికి సమయమైనందున పార్లమెంట్ కమిటీ వేయాలని జనసేన పార్టీ నాయకులకు తెలిపారు పవన్. రాబోయే రోజుల్లో ఏపీ రాష్ట్రంలో జనసేన పార్టీ కీలకం కాబోతుందని ప్రతి ఒక్కరు కష్టపడాలని జిల్లా నేతలకు సూచించారు పవన్. ప్రజారాజ్యం పార్టీ పెట్టి విఫలమైన వాటి విషయాల నుండి చాలా నేర్చుకున్నానని మాట్లాడుతూ..ఒక పార్టీ పెట్టి ఇంతకాలం నడపడం నాకు అసాధ్యమైన పనే కానీ కేవలం జనసేన పార్టీ కార్యకర్తలు మరియు అభిమానుల వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. వారు చేస్తున్న కృషిని నేనెప్పటికీ మర్చిపోలేని అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Top