జగన్ కోడి కత్తి కేసులో సంచలన ట్విస్ట్..!

By Xappie Desk, January 13, 2019 14:59 IST

జగన్ కోడి కత్తి కేసులో సంచలన ట్విస్ట్..!

విశాఖపట్నం విమానాశ్రయం లో జగన్ పై కోడి కత్తి తో చేసిన దాడి కేసు విషయంలో రోజుకో ట్విస్ట్ జరుగుతుంది. ఇప్పటికే ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ కి అప్పగించాలని హైకోర్టు ఇటీవల ఆదేశాలు ఇచ్చిన విషయం మనకందరికీ తెలిసినదే. తాజా పరిణామంతో తెలుగుదేశం పార్టీలో అలజడి మొదలయ్యింది. ఇదిలా ఉండగా నిందితుడు శ్రీనివాస్‌రావుకు వారం రోజుల పాటు ఎన్ఐఏ క‌స్ట‌డీకి విజ‌య‌వాడ కోర్టు అంగీక‌రించ‌డం హాట్ టాపిక్ అవుతోంది. ఇక జ‌గ‌న్ పై జ‌రిగిన కోడికత్తి దాడి కేసులో వ్య‌వ‌హారంలో రంగంలోకి దిగిన ఎన్ఐఏ విచారణ చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో తాజాగా విజయవాడ కోర్టులో నిందితుడిని హాజరుపర్చగా.. కోర్టు ఎన్ఐఏ కష్టడీకి ఇవ్వాలంటూ తీర్పు ఇచ్చింది. అయితే ఎన్ఐఏకు కోర్టు కొన్ని షరతులు విధించింది. నిందితుడి పై థర్డ్ డిగ్రీ ప్రయోగించరాదని న్యాయస్థానం పేర్కొంది. నిందితుడు కోరితే న్యాయవాది సమక్షంలో విచారించాలర‌ని, అలాగే నిందితుడికి మూడు రోజులకు ఒక సారి వైద్య పరీక్షలు నిర్వహించాలని న్యాయ స్థానం ఆదేశిస్తూ.. తదుపరి విచారణ ఈ నెల 25కి వాయిదా వేసింది. ఇక ఇప్ప‌టికే సమయం మించి పోవడంతో నిందితుడు శ్రీనివాస్ రావును రేపు కష్టడిలోకి తీసుకోవాలని ఎన్ఐఏ నిర్ణయించింది. మ‌రి జ‌గ‌న్ పై దాడి కేసులో అసలు విష‌యాలు బ‌య‌ట‌ప‌డ‌తాయో లేదో చూడాలి.Top