జన్మభూమి కార్యక్రమంలో బిజెపి పార్టీ కి చుక్కలు చూపించిన మంత్రి నారా లోకేష్..!

Written By Xappie Desk | Updated: January 13, 2019 15:03 IST
జన్మభూమి కార్యక్రమంలో బిజెపి పార్టీ కి చుక్కలు చూపించిన మంత్రి నారా లోకేష్..!

విభజనతో నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని మరింత ఇబ్బందులపాలు చేసిన బిజెపి పార్టీకి ఏపీ ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెబుతారని ఇటీవల జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అంతేకాకుండా గతంలో కర్ణాటక రాష్ట్రంలో ప్రజలు కేవలం ట్రైలర్ మాత్రమే చూపించారని అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే సినిమా చూపించడానికి రెడీ గా ఉన్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇటీవల తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నియోజక వర్గంలో జరిగిన జన్మభూమి మా వూరు కార్యక్రమంలో నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ బిజెపి పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఏపీ బిజెపి పార్టీ కి చుక్కలు చూపించారు. ప్రజలు ఎంతగానో నమ్మకం పెట్టుకున్న మోడీ చాలా మోసం చేశారని, మోడీ ఒక మోనార్క్ లా మారాడని లోకేష్ అన్నారు. ఏపీ లో జరిగే ఎన్నికల తరువాత దేశ ప్రధాని ఎవరు అనేది చంద్రబాబు నిర్ణయిస్తాడని లోకేష్ అన్నారు. జగన్‌‌తో కలిసి మోదీ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు. ప్రత్యేక హోదాపై జగన్‌ ఏనాడైనా మోదీని నిలదీశారా అని ప్రశ్నించారు. ప్రజాసంకల్ప యాత్ర ముగింపు సభలో.. జగన్ మోదీపై ఒక్క విమర్శ చేయలేదని గుర్తుచేశారు. జగన్‌పై ఉన్న కేసులను నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. మల్లి ఏపీ లో రానున్నది చంద్రబాబు ప్రభుత్వమేనని, అందుకోసం ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారని మంత్రి లోకేష్ అన్నారు.
Top