ప్రస్తుత రాజకీయాల గురించి చంద్రబాబు ని ఒక ఆట ఆడుకున్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని..!

Written By Xappie Desk | Updated: January 13, 2019 15:07 IST
ప్రస్తుత రాజకీయాల గురించి చంద్రబాబు ని ఒక ఆట ఆడుకున్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని..!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై గుడివాడ నియోజకవర్గం వైసీపీ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు టైం అయిపోయింది అని నీచమైన రాజకీయాలు ఇంకా ప్రజలు సహించరని చంద్రబాబు చేస్తున్న రాజకీయాలను ఉద్దేశించి తన వ్యాఖ్యలతో ఒక ఆట ఆడుకున్నారు కొడాలి నాని. ఇంకా నాని మాట్లాడుతూ అసలు మీకు సిగ్గు, శరం ఉందా‘పవన్ కల్యాణ్ వచ్చి నాతో కలవాలని చంద్రబాబు అంటారు. అసలు మీకు సిగ్గు, శరం ఉందా? మిమ్మల్ని రోజూ తిడుతున్న వ్యక్తి వచ్చి మధ్దతు ఇవ్వాలని కోరుతున్నావు. కాంగ్రెస్ వచ్చి నాతో కలవాలని అంటావు. అధికారం చేజిక్కించుకోవడానికి ఎంతకైనా దిగజారుతారు. జగన్‌కు దమ్ము, ధైర్యం ఉంది కాబట్టి సోలోగా పోటి చేస్తానని ప్రకటించారు. అసెంబ్లీకి వెళ్లకుండా జీతాలు తీసుకుంటున్నారని మమ్మల్ని విమర్శిస్తున్నారు. మరి మీరు 365 రోజులు అసెంబ్లీలోనే ఉండి జీతాలు తీసుకుంటున్నారా? మీరు ఎన్ని రోజులు అసెంబ్లీకి వెళ్తున్నారు. అసెంబ్లీకి వెళ్లని మిగిలిన రోజులకు మీరు జీతాలు ఇచ్చేస్తే మేం కూడా జీతాలు తిరిగి ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. కేసీఆర్ 20 ప్రశ్నలు అడిగితే ఒకదానికి కూడా సమాధానం చెప్పలేదు. చంద్రబాబు దగ్గరున్న ఊర కుక్కలతో మొరిగించాడు. చంద్రబాబూ నీ టైమ్ అయిపోయింది. కాబట్టి ఇప్పటికైనా బుద్ది తెచ్చుకుని ప్రజల కష్టాలు, నష్టాలు తెలుసుకుని పరిపాలన సాగించు. ఎన్నికలు వస్తున్నాయ్ అని చెప్పి ఎక్కడపడితే అక్కడ శంకుస్థాపనలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు పెద్ద సైకో. మాది కోడి కత్తి పార్టీ అంటూ విమర్శిస్తున్నారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన మీది కట్టప్ప కత్తి పార్టీయా’ అంటూ కొడాలి నాని విమర్శించారు.
Top